Breaking News

IPL 2024: ఐపీఎల్‌పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్‌ మాజీ ఆటగాడు

Published on Thu, 04/04/2024 - 18:33

భారత క్రికెట్‌పై, క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్తాన్‌ క్రికెటర్లకు పరిపాటిగా మారింది. సందర్భం ఏదైనా సరే పాక్‌ ప్రస్తుత, మాజీలు భారత క్రికెట్‌పై నోరుపారేసుకుంటుంటారు. తాజాగా ఓ పాక్‌ మాజీ భారత క్రికెట్‌లో అంతర్బాగమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. 

34 ఏళ్ల పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ ఐపీఎల్‌ను, ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ఓర్వలేని కామెంట్లు చేశాడు. ఐపీఎల్‌ 2024లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌ ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ను జునైద్‌ చులకన చేసే ప్రయత్నం చేశాడు. 

ఐపీఎల్‌లో (భారత్‌లో) ఫ్లాట్‌ పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడం చాలా సులువని.. అంతర్జాతీయ కెరీర్‌ (టీ20ల్లో) మొత్తంలో 155 పరుగులు చేసిన నరైన్‌ ఒక్క  ఇన్నింగ్స్‌లోనే 85 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనమని ట్విటర్‌ వేదికగా అర్దంపర్దం లేని కామెంట్లు చేశాడు. 

జునైద్‌ ఈ ట్వీట్‌ చేయకముందు న్యూజిలాండ్‌ క్రికటర్లను సైతం అవమానిస్తూ ఓ ట్వీట్‌ చేశాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్లకు జాతీయ జట్టు ప్రయోజనాల కంటే ఐపీఎలే ముఖ్యమైందని కామెంట్‌ చేశాడు.  కివీస్‌ సీనియర్లు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్‌ ఆడేందుకు చెక్కేశారని అన్నాడు.

జునైద్‌ చేసిన ఈ కామెంట్స్‌పై భారత క్రికెట్‌ అభిమానులు స్పందించేందకు సైతం ఇష్టపడటం లేదు. పాక్‌ క్రికెటర్లకు భారత క్రికెట్‌ను ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు, తిండి సహించదని చురకలంటిచి వదిలేస్తున్నారు. 

కాగా, పాకి​స్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టును నిన్న ప్రకటించారు. ఐపీఎల్‌ కారణంగా ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియ‍మ్సన్‌ లాంటి సీనియర్‌ ఆటగాళ్లు పాక్‌ సిరీస్‌లో పాల్గొనడం లేదు.

ఈ కారణంగానే జునైద్‌ ఐపీఎల్‌పై అవాక్కులు చవాక్కులు పేలాడు. పాక్‌ క్రికెటర్లకు ఐపీఎల్‌లో ప్రవేశం​ లేదన్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల జునైద్‌ 2011-19 మధ్యలో పాక్‌ తరఫున 22 టెస్ట్‌లు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఇందులో అతను 189 వికెట్లు పడగొట్టాడు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు