Breaking News

Sam Curran: పర్లేదు.. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు..!

Published on Thu, 04/06/2023 - 09:09

ఐపీఎల్‌-2023లో అత్యధిక ధర పలికిన పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ (18.5 కోట్లు).. తనపై పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పటివరకు అతను‌ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపిస్తున్నాడు. ఐపీఎల్‌-2023లో ఇతర ఖరీదైన ఆటగాళ్లలా కాకుండా అంచనాలను తగ్గట్టుగా రాణిస్తూ నాట్‌ బ్యాడ్‌ అనిపిస్తున్నాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో కర్రన్‌ తర్వాత అత్యంత ఖరీదైన ఆటగాళ్లు కెమారూన్‌ గ్రీన్‌ (ఎంఐ, 17.5 కోట్లు), కేఎల్‌ రాహుల్‌ (లక్నో, 17 కోట్లు), బెన్‌ స్టోక్స్‌ (16.25 కోట్లు) అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతుంటే.. కర్రన్‌ ఓకే అనిపిస్తున్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో (17 బంతుల్లో 26 నాటౌట్‌; 2 సిక్సర్లు), బంతితో (1/38) ఓ మోస్తరుగా రాణించిన అతను.. నిన్న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ సమరంలో ఆఖరి ఓవర్‌లో 16 పరుగులకు డిఫెండ్‌ చేసి (10 పరుగులు మాత్రమే ఇచ్చాడు) తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించి, రన్నింగ్‌ ఎడిషన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కర్రన్‌ ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు డిఫెండ్‌ చేసిన తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తు​న్నాడని కామెంట్లు చేస్తున్నారు. ఆఖరి ఓవర్‌ అద్భుతమైన మెచ్యూరిటీతో బౌల్‌ చేశాడని కితాబునిస్తున్నారు. కర్రన్‌ ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తే ఈ ఏడాది పంజాబ్‌ కింగ్స్‌ టైటిల్‌ కల సాకారమవుతుందని అంటున్నారు. 

ఇదిలా ఉంటే, పంజాబ్‌-రాజస్థాన్‌ జట్ల మధ్య నువ్వా-నేనా అన్నట్లు సాగిన టఫ్‌ ఫైట్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. 198 పరుగుల లక్ష్యఛేదనలో 124 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకున్న రాజస్థాన్‌ను హెట్‌మైర్‌ (18 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ధ్రువ్‌ జురెల్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతో గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖరి ఓవర్లో విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. కర్రన్‌  తెలివైన బౌలింగ్‌తో రాజస్థాన్‌ గెలుపును అడ్డుకున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)