Breaking News

IPL 2023: లిటన్‌ దాస్‌ స్థానంలో బిగ్‌ హిట్టర్‌.. ఇక

Published on Fri, 05/05/2023 - 08:19

IPL 2023- KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టులో వెస్టిండీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జాన్సన్‌ చార్లెస్‌ చేరనున్నాడు. బంగ్లా ఆటగాడు లిటన్‌దాస్‌ కుటుంబ సభ్యుల ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా స్వదేశం పయనమయ్యాడు. దీంతో ఐపీఎల్‌-2023 మిగతా సీజన్‌ కోసం అతని స్థానంలో చార్లెస్‌ను రూ.50 లక్షల కనీస ధరకు కోల్‌కతా తీసుకుంది. ఈ మేరకు కేకేఆర్‌ గురువారం ప్రకటన విడుదల చేసింది.

బిగ్‌ హిట్టర్‌
‘‘ఫ్యామిలీ మెడికల్‌ ఎమర్జెన్సీ దృష్ట్యా లిటన్‌దాస్‌ ఏప్రిల్‌ 28న స్వదేశం బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అతడు, అతడి కుటుంబ సభ్యులు బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో చార్లెస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా జాన్సన్‌ చార్లెస్‌ విండీస్‌ తరఫున 41 అంతర్జాతీయ టి20లు ఆడి.. 971 పరుగులు చేశాడు.

అదే విధంగా.. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు గెలిచిన కరీబియన్‌ జట్టులో చార్లెస్‌ సభ్యుడుగా ఉన్నాడు. అంతేగాక ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పొట్టిఫార్మాట్లో మొత్తంగా 224 మ్యాచ్‌లు ఆడి.. 5600 పరుగులు సాధించాడు. బిగ్‌ హిట్టర్‌గా పేరొందిన చార్లెస్‌ రాకతో కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరింత పటిష్టం కానుంది.

రైజర్స్‌పై విజయం
ఇదిలా ఉంటే.. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్‌ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో గెలుపు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: డెత్‌ ఓవర్లలో 'కింగ్‌' అనిపించుకుంటున్న రింకూ సింగ్‌
నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్‌ దక్కకుండా చేస్తాడు: ఇషాన్‌ కిషన్‌

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)