Breaking News

IPL 2023: పోటీకి సై అంటున్న నాలుగు జట్లు! ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌, వివరాలు ఇవే

Published on Mon, 05/22/2023 - 10:09

IPL 2023 Playoffs: ఐపీఎల్‌-2023 తుది అంకానికి చేరుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లతో లీగ్‌ దశ ముగిసింది. రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ముంబై ప్లే ఆఫ్స్‌ చేరుకోగా.. గుజరాత్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ఆర్సీబీ ఇంటిబాట పట్టింది.

డిఫెండింగ్‌ చాంపియన్‌ లెక్కే వేరు!
ఇక​ అన్ని జట్ల కంటే ముందుగానే ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకున్న గుజరాత్‌.. బెంగళూరుపై ఘన విజయం నేపథ్యంలో సీజన్‌లో పదో గెలుపు నమోదు చేసింది. ఈ డిఫెండింగ్‌ చాంపియన్‌ 20 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా నిలిచింది. మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌పై గెలుపుతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ సైతం ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

తాజా విజయంతో ముంబై టాప్‌-4లో నిలిచి గత ఎడిషన్‌ తాలుకు చేదు అనుభవాల నుంచి తేరుకుంది. ఆడిన 14 మ్యాచ్‌లలో ఎనిమిదింట గెలుపొందిన రోహిత్‌ సేన.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 

ఈ క్రమంలో.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో(మూడో స్థానం)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌, వేదికలు, మ్యాచ్‌ ఆరంభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం.

ఐపీఎల్‌-2023 ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌ 
మే 23: క్వాలిఫయర్‌–1 
►గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ 
►వేదిక: చెన్నై- - ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్‌)
►మ్యాచ్‌ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి 

మే 24: ఎలిమినేటర్‌ 
►లక్నో సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్‌ ముంబై  ఇండియన్స్‌
►వేదిక: చెన్నై- ఎంఏ చిదంబరం స్టేడియం(చెపాక్‌)
►మ్యాచ్‌ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి 

మే 26: క్వాలిఫయర్‌–2 
►క్వాలిఫయర్‌–1లో ఓడిన జట్టు వర్సెస్‌ ఎలిమినేటర్‌  విజేత 
►వేదిక: అహ్మదాబాద్‌- నరేంద్ర మోదీ స్టేడియం
►మ్యాచ్‌ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి 

మే 28: ఐపీఎల్‌-2023 ఫైనల్‌ 
►క్వాలిఫయర్‌–1 విజేత వర్సెస్‌ క్వాలిఫయర్‌–2 విజేత 
►వేదిక: అహ్మదాబాద్‌- నరేంద్ర మోదీ స్టేడియం
►మ్యాచ్‌ ఆరంభ సమయం: రాత్రి గం. 7:30 నుంచి ఆరంభం.

చదవండి: ప్లే ఆఫ్స్ నుంచి ఆర్సీబీ ఔట్.. కోహ్లిని మరోసారి టార్గెట్‌ చేసిన నవీన్‌! ఛీ అసలు నీవు
కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)