Breaking News

IPL 2023: హౌస్ ఫుల్.. జోష్ నిల్.. చీర్‌ గర్ల్స్‌కు పెద్దగా పనేలేకుండా పోయింది!

Published on Mon, 04/03/2023 - 10:45

సాక్షి, హైదరాబాద్‌: సుదీర్ఘ విరామం తర్వాత భాగ్యనగరంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇరు జట్లలోనూ భారత స్టార్‌ ఆటగాళ్లెవరూ లేకపోయినా స్టేడియం దాదాపుగా నిండిపోవడం విశేషం. హెచ్‌సీఏ అధికారిక లెక్క ప్రకారం 37,731 మంది ప్రేక్షకులు వచ్చారు. ఆదివారం కావడం, నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌ మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహం ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో మైదానానికి తీసుకొచ్చాయి.

మిట్టమధ్యాహ్నం తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా వారంతా స్టేడియంలోకి అడుగు పెట్టారు. కాగా.. సన్‌రైజర్స్‌ అభిమానులకు మాత్రం సరైన ఆనందం దక్కలేదు. పేలవమైన ఆట తీరుతో భారీ పరాజయాన్ని అందుకున్న హైదరాబాద్‌ జట్టు ఏ దశలోనూ తగిన వినోదాన్ని అందించలేకపోయింది. అందుకే చాలా మంది అభిమానుల్లో తీవ్ర నిరాశ కనిపించింది.

ఇన్నింగ్స్‌ మొత్తంలో రైజర్స్‌ బ్యాటర్లు 8 ఫోర్లు, 5 సిక్స్‌లు మాత్రమే కొట్టడంతో ఫ్యాన్స్‌కే కాదు, చీర్‌ గర్‌ల్స్‌కు కూడా పెద్దగా పని లేకుండా పోయింది. ఆరంభంలో రాజస్తాన్‌ ప్లేయర్లు కొట్టిన మెరుపు షాట్లే కాస్త చప్పట్లు కొట్టేలా చేశాయి. వచ్చే ఆదివారం కూడా మరో మ్యాచ్‌ హైదరాబాద్‌లోనే ఉంది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగే ఆ పోరులోనైనా లోకల్‌ ఫ్యాన్స్‌ సంబరపడే క్షణాలు వస్తాయేమో చూడాలి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)