Breaking News

ఐపీఎల్ ఫైనల్ టికెట్ల కోసం అభిమానుల అవస్థలు.. స్టేడియం వద్ద తొక్కిసలాట!

Published on Fri, 05/26/2023 - 12:27

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర గురువారం తొక్కిసలాట చోటు చేసుకుంది. టిక్కెట్ల కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఈ ఘటన జరిగింది. అయితే వాస్తవానికి ఫైనల్‌కు సంబంధించిన టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించారు. ఆఫ్‌లైన్ టిక్కెట్‌ల విక్రయానికి సంబంధించి గుజరాత్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ కూడా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కానీ ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు మాత్రం స్టేడియం బాక్స్ ఆఫీస్ వద్ద క్యూఆర్ కోడ్‌ను చూపించి తమ ఫిజికల్‌ టికెట్లను తీసుకోవాలి గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తమ ఫిజికల్‌ టికెట్లను పొందేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియంకు తరలివచ్చారు. అయితే స్టేడియం వద్ద తక్కువ కౌంటర్‌లను ఏర్పాటు చేయడంతో ఈ గందరగోళం నెలకొంది.

ఈ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఫిజికల్‌ టిక్కెట్లను పొందేందుకు గురువారం(మే25) నుంచి శనివారం వరకు అవకాశం ఇచ్చారు. దీంతో గురువారం వేలాది మంది అభిమానులు తమ టిక్కెట్లు పొందేందుకు స్టేడియం బయట గుమిగూడారు.  ఒకరినొకరు తోసుకుంటూ, కింద పడుతూ అభిమానులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాస్త ప్రశాంత వాతావారణం నెలకొంది.

ఇక ఇదే వేదికలో శుక్రవారం గుజరాత్‌-ముంబై మధ్య క్వాలిఫియర్‌-2 జరగనుంది. కాబట్టి అభిమానులు ఫైనల్‌ మ్యాచ్‌ ఫిజికల్‌ టిక్కెట్లు పొందే అవకాశం లేదు. దీంతో మళ్లీ శనివారం ఉద్రిక్త వాతవారణం నెలకొనే ఛాన్స్‌ ఉంది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కానున్నట్లు తెలుస్తోంది.  ఇక సీఎస్‌కేతో ఫైనల్లో తలపడబోయే జట్టు  ఏదో శుక్రవారం (మే 26) తేలనుంది. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే రెండో క్వాలిఫయర్ విజేతతో చెన్నై ఫైనల్లో తలపడనుంది.
చదవండి: IPL 2023: నేను చూసుకుంటాను.. శ్రీలంక క్రికెటర్‌ కుటుంబానికి భరోసా ఇచ్చిన ధోని

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)