Ben Stokes: టైం అయ్యింది.. డబ్బులు ముట్టాయి, వెళ్లొస్తా..!

Published on Sun, 05/21/2023 - 16:20

ఐపీఎల్‌ 2023లో కష్టపడకుండా అధిక లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అని చెప్పాలి. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్‌ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు 16. అంటే పరుగుకు కోటి రూపాయల పై మాటే అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు తగుదునమ్మా అని స్వదేశానికి బయల్దేరాడు.

స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ (జూన్‌ 1 నుంచి) ఆడేందుకు స్టోక్స్‌ సీఎస్‌కే క్యాంప్‌ను వీడాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యమే అధికారికంగా ట్వీట్‌ చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు కోట్లు పోసి కొనుక్కున ఫ్రాంచైజీకి పంగనామం పెట్టడంతో స్టోక్స్‌పై సీఎస్‌కే అభిమానులు మండిపడుతున్నారు. కారణాలు ఏవైనా డబ్బులిచ్చాక లీగ్‌ అయిపోయేంత వరకు ఉండాలని చురకలంటిస్తున్నారు.

దేశం కోసం మాత్రమే ఆడాలనుకున్నప్పుడు.. ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ లాగా ఐపీఎల్‌లో పేరు కూడా నమోదు చేసుకోకుండా ఉండాల్సిందంటూ మందలిస్తున్నారు. ఐపీఎల్‌ ఆడటానికి వచ్చినట్లు లేదు, సమ్మర్‌ వెకేషన్‌ ఎంజాయ్‌ చేయడానికి వచ్చినట్లుందని అంటున్నారు. కాగా, ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకున్న ఆటగాడు ఆడినా ఆడకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే.

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌లో సీఎస్‌కే అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో దూసుకుపోతుంది. ధోని సేన ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. మే 23న జరిగే క్వాలిఫయర్‌-1లో సీఎస్‌కే.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇవాల్టి (మే 21) మ్యాచ్‌లతో తేలిపోతాయి. లక్నో ఇదివరకే ఓ బెర్తు కన్ఫర్మ్‌ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, రాజస్థాన్‌, ముంబై ఇండియన్స్‌ పోటీపడుతున్నాయి.

చదవండి: అప్పటి నుంచి అందరూ గుర్తు పడుతున్నారు.. ఆరోజు ఒక్క బాల్‌ మిస్‌ చేసినా!

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)