Breaking News

IPL 2022: వారెవ్వా చహల్‌.. మూడు వికెట్లు.. అద్భుత రికార్డు!

Published on Sat, 05/07/2022 - 17:36

IPL 2022 PBKS Vs RR- Yuzvendra Chahal Record: ఐపీఎల్‌ మెగా వేలం-2022కు ముందు క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడు టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌. రిటెన్షన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు అతడిని వదిలేయగా వేలంలోకి వచ్చాడు. దీంతో రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీ పడి మరీ ఆరున్నర కోట్లు వెచ్చించి చహల్‌ను సొంతం చేసుకుంది.

అందుకు తగ్గట్టుగానే ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చహల్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో ప్రస్తుతం పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్న చహల్‌ భాయ్‌ పంజాబ్‌ కింగ్స్‌తో శనివారం(మే 7) నాటి మ్యాచ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. 

ఒక సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చరిత్రకెక్కాడు. 2019లో 20 వికెట్లతో ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్న శ్రేయస్‌ గోపాల్‌ను అధిగమించాడు. పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా జానీ బెయిర్‌ స్టో వికెట్‌ తన ఖాతాలో వేసుకుని ఈ ఫీట్‌ నమోదు చేశాడు.   

కాగా తాజా ఎడిషన్‌లో చహల్‌ ఇప్పటి వరకు 22 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో చహల్‌ 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన చహల్‌ 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో చహల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌.. ‘‘ఇతడు చాలా బాగా ఆడుతున్నాడు. టూ గుడ్‌’’ అంటూ కొనియాడాడు.

చదవండి👉🏾Kieron Pollard: పొలార్డ్‌పై వేటు తప్పదు.. ఇకపై అతడికి అవకాశం ఉండదు!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)