Breaking News

కేకేఆర్‌ను కుమ్మేసిన లక్నో..

Published on Sun, 05/08/2022 - 07:43

పుణే: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి అగ్ర స్థానానికి దూసుకుపోగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) మరో పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగులతో నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డి కాక్‌ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా... దీపక్‌ హుడా (27 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం కోల్‌కతా 14.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. రసెల్‌(19 బంతుల్లో 45; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యా రు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవేశ్‌ ఖాన్‌ (3/19), హోల్డర్‌ (3/31) కోల్‌కతాను దెబ్బ తీశారు.  

ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రాహుల్‌ (0) రనౌట్‌ కావడంతో డి కాక్, హుడా కలిసి జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. చివర్లో స్టొయినిస్‌ (14 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) జోరుతో లక్నో మెరుగైన స్కోరు సాధించగలిగింది.  ఛేదనలో కోల్‌కతా దారుణంగా విఫలమైంది. ఇంద్రజిత్‌ (0), శ్రేయస్‌ (6), ఫించ్‌ (14), నితీశ్‌ రాణా (2) విఫలం కావడంతో 25 పరుగులకే ఆ జట్టు 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రసెల్‌ మెరుపులు ఇన్నింగ్స్‌కు కాస్త ఊపు తెచ్చాయి. ముఖ్యంగా హోల్డర్‌ ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 2, 6, 4 బాది రసెల్‌ దూకుడు ప్రదర్శించాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను  అవుట్‌ కావడంతో కేకేఆర్‌ గెలుపు దారులు మూసుకుపోయాయి.  

ఒకే ఓవర్లో 30 పరుగులు
లక్నో ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ హైలైట్‌గా నిలి చింది. శివమ్‌ మావి వేసిన ఈ ఓవర్లో స్టొయినిస్‌ తొలి మూడు బంతుల్లో 6, 6, 6 బాది నాలుగో బంతికి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన హోల్డర్‌ తర్వాతి 2 బంతులను 6, 6 కొట్టడంతో మొత్తం 5 సిక్సర్లతో ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి.  

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)