అనంతపురం జిల్లాలో భారీ వర్షం
Breaking News
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ
Published on Sun, 04/17/2022 - 17:14
ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ మ్యాచ్‌కు ఎందుకు దూరమయ్యాడన్న సందేహం చాలా మంది అభిమానుల్లో మెదిలింది. అయితే టాస్ సమయంలో గ్రౌండ్‌కు వచ్చిన ధావన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
''మయాంక్ అగర్వాల్ కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో నేను జట్టును నడిపిస్తున్నా. అతని పరిస్థితి బాగానే ఉంది. బహుశా తర్వాతి మ్యాచ్‌కు మయాంక్ అగర్వాల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మయాంక్ అగర్వాల్ ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కెప్టెన్‌గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న మయాంక్ బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. రెండు ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.
చదవండి: 'సాధారణ ఆటగాడిలా ఫీలవ్వు'.. కోహ్లికి మాజీ క్రికెటర్ సలహా
Tags : 1