Breaking News

పంజాబ్‌ బౌలర్‌కు చుక్కలు చూపించిన రసెల్‌

Published on Fri, 04/01/2022 - 23:21

ఐపీఎల్‌ 2022లో ఆండ్రీ రసెల్‌ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్‌లోకి వస్తే ఎంతటి డేంజర్‌ బ్యాట్స్‌మన్‌ అనేది చెప్పకనే చెప్పాడు. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్‌ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. ఆరంభంలో కాస్త నిధానంగా కనిపించిన రసెల్‌ ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌లో గేర్‌ మార్చాడు. హర్‌ప్రీత్‌ బార్‌ వేసిన పదో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రసెల్‌ మొత్తంగా 17 పరుగులు పిండుకున్నాడు.

ఆ తర్వాత ఓడియన్‌ స్మిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్మిత్‌ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌, నో బాల్‌ సహా మొత్తం 24 పరుగులు రసెల్‌ పిండుకోగా.. చివరి బంతిని సామ్‌ బిల్లింగ్స్‌ సిక్సర్‌ సంధించడంతో మొత్తంగా ఆ ఓవర్‌లో 30 పరుగులు వచ్చాయి. మ్యాచ్‌ టర్నింగ్‌ పాయింట్‌ కావడంతో పాటు  స్మిత్‌కు రసెల్‌ చుక్కలు చూపించాడు.

ఆండ్రీ రసెల్‌ విధ్వంసం కోసం క్లిక్‌ చేయండి

చదవండి: IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌ అంటే ఉమేశ్‌ యాదవ్‌కు ఎందుకంత ఇష్టం!

Videos

కుళ్లుబోతు రాజకీయాలు

తోక జాడిస్తే.. కార్గిల్ సీన్ రిపీట్ అవుద్ది

విచారణ పేరుతో సిట్ వేధింపులు

సూపర్ సిక్స్ హామీలపై సీఎం చంద్రబాబు మరోసారి బుకాయింపు

Big Question: రిమాండ్ రిపోర్టుల సాక్షిగా బయటపడుతున్న బాబు కుట్ర

వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు

Miss World 2025: అందం అంటే..!

Ambati: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధ పడుతున్నారు

హైదరాబాద్ మెట్రోరైలు ఛార్జీలు పెంపు

చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం

Photos

+5

'వచ్చినవాడు గౌతమ్‌' సినిమా టీజర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

సుందరీమణుల మనస్సు దోచిన 'పోచంపల్లి చీరలు'..ఫ్యాషన్ షో అదరహో (ఫొటోలు)

+5

సరస్వతి పుష్కరాలు.. కాళేశ్వరంలో సీఎం రేవంత్‌ పర్యటన (ఫొటోలు)

+5

Miss World 2025 : యాదగిరిగుట్ట, పోచంపల్లిలో మిస్‌ వరల్డ్‌ బ్యూటీస్‌ సందడి (ఫొటోలు)

+5

బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)

+5

డ్యాన్సింగ్‌ క్వీన్‌ 'మాధురీ దీక్షిత్‌' బర్త్‌డే.. ఈ విషయాలు తెలుసా?

+5

నిఖిల్‌ సిద్ధార్థ్ పెళ్లికి ఐదేళ్లు.. భార్యకు స్పెషల్ విషెస్ (ఫొటోలు)

+5

తెలంగాణ : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం (ఫొటోలు)

+5

అనంతపురంలో కుండపోత వర్షం.. వరద నీటిలో ప్రజల ఇక్కట్లు (ఫొటోలు)

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)