Breaking News

సీఎస్‌కేలో 10 మందే బ్యాటర్లు.. ధోని కీపర్‌, కెప్టెన్‌ మాత్రమే..!

Published on Fri, 10/01/2021 - 19:44

Aakash Chopra Comments On MS Dhoni: చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో సీఎస్‌కే 10 మంది బ్యాటర్లతోనే ఆడుతోందని.. ధోని వికెట్‌కీపర్‌, కెప్టెన్‌గానే సేవలందిస్తున్నాడని.. అతని బ్యాటింగ్​తో జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేదని ధోనిపై పరోక్ష విమర్శలు గుప్పించాడు. బ్యాటర్‌గా ధోని జట్టులో ఉన్నా.. లేనట్టేనని, ప్రస్తుత సీజన్​లో అతని గణాంకాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. అయితే కెప్టెన్సీ విషయంలో ఆకాశ్‌ చోప్రా ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

గతేడాది దారుణంగా విఫలమైన జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడని, సరైన వ్యూహాలు రచించి జట్టును విజయపథం నడిపించడం ధోనికి మాత్రమే సాధ్యమని కొనియాడాడు. ధోని లాంటి వ్యక్తి కెప్టెన్‌గా ఉండడం సీఎస్‌కేకు అదనపు బలమని, జట్టును ఓటమి కోరల్లో నుంచి సైతం బయటపడేయగల సామర్ధ్యం ధోని సొంతమని ఆకాశానికెత్తాడు. కాగా, ధోని ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్​ల్లో 11.40 సగటున కేవలం 66 పరుగులు మాత్రమే స్కోర్‌ చేశాడు. బ్యాటర్‌గా దారుణంగా విఫలమైనా కెప్టెన్సీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్‌-2021లో ధోని సారధ్యంలో సీఎస్‌కే జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
చదవండి: సచిన్‌ను చూసాక ఇషాన్‌ కిషన్‌ రియాక్షన్‌.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్‌

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)