Breaking News

ఇంగ్లండ్‌తో సమరం.. సత్తా చాటిన భారత బౌలర్లు

Published on Tue, 02/25/2025 - 21:39

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌లో (International Masters League-2025) భారత మాస్టర్స్‌ (Indian Masters) ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్‌ మాస్టర్స్‌తో (England Masters) తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్‌ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 

ధవల్‌ కులకర్ణి 3, అభిమన్యు మిథున్‌, పవన్‌ నేగి తలో 2, వినయ్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఒక ఓవర్‌ వేసిన స్టువర్ట్‌ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డారెన్‌ మ్యాడీ (25) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. టిమ్‌ ఆంబ్రోస్‌ (23), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (14), టిమ్‌ బ్రేస్నన్‌ (16), క్రిస్‌ స్కోఫీల్డ్‌ (18 నాటౌట్‌), క్రిస్‌ ట్రెమ్లెట్‌ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ మస్టర్డ్‌ 8, మాస్కరెన్హాస్‌ 6, స్టీవ్‌ ఫిన్‌ ఒక్క పరుగుకు ఔటయ్యారు.

కాగా, ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు దేశాలు (భారత్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాల​కు చెందిన మాజీలు, స్టార్‌ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్‌.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 

రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్‌ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ తరఫున స్టువర్ట్‌ బిన్నీ (68), యుసఫ్‌ పఠాన్‌ (56 నాటౌట్‌), ఇర్ఫాన్‌ పఠాన్‌ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్‌ సిమన్స్‌ (94 నాటౌట్‌), డ్వేన్‌ స్మిత్‌ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యం వహిస్తున్నాడు. భారత్‌ తరఫున అంబటి రాయుడు, యువరాజ్‌ సింగ్‌ లాంటి స్టార్లు ఆడుతున్నారు.

భారత మాస్టర్స్‌ జట్టు..
అంబటి రాయుడు (వికెట్‌కీపర్‌), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్‌), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్

ఇంగ్లండ్‌ మాస్ట‍ర్స్‌ జట్టు..
ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్‌), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్‌బాటమ్

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌లో భారత మాస్టర్స్‌ ఇవాళ (ఫిబ్రవరి 25) ఇంగ్లండ్‌ మాస్టర్స్‌తో తలపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నారు. భారత బౌలర్లు తలో చేయి వేయడంతో ఇంగ్లండ్‌ జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ధవల్‌ కులకర్ణి 3, అభిమన్యు మిథున్‌, పవన్‌ నేగి తలో 2, వినయ్‌ కుమార్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. ఒక ఓవర్‌ వేసిన స్టువర్ట్‌ బిన్నీ 15 పరుగులివ్వగా.. 4 ఓవర్లు వేసిన ఇర్ఫాన్‌ పఠాన్‌ వికెట్లేమీ లేకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డారెన్‌ మ్యాడీ (25) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. టిమ్‌ ఆంబ్రోస్‌ (23), కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (14), టిమ్‌ బ్రేస్నన్‌ (16), క్రిస్‌ స్కోఫీల్డ్‌ (18 నాటౌట్‌), క్రిస్‌ ట్రెమ్లెట్‌ (16) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఫిల్‌ మస్టర్డ్‌ 8, మాస్కరెన్హాస్‌ 6, స్టీవ్‌ ఫిన్‌ ఒక్క పరుగుకు ఔటయ్యారు.

కాగా, ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ ఈ సీజన్‌తోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో ఆరు దేశాలు (భారత్‌, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా) పాల్గొంటున్నాయి. ఆయా దేశాల​కు చెందిన మాజీలుచ, స్టార్‌ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో భారత్‌.. శ్రీలంక మాస్టర్స్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను వెస్టిండీస్‌ మట్టికరిపించింది. తొలి మ్యాచ్‌లో భారత్‌ తరఫున స్టువర్ట్‌ బిన్నీ (68), యుసఫ్‌ పఠాన్‌ (56 నాటౌట్‌), ఇర్ఫాన్‌ పఠాన్‌ (4-0-39-3) సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ చేసిన సెంచరీ వృధా అయ్యింది. లెండిల్‌ సిమన్స్‌ (94 నాటౌట్‌), డ్వేన్‌ స్మిత్‌ (51) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి విండీస్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో భారత్‌కు సచిన్‌ టెండూల్కర్‌ సారథ్యం వహిస్తున్నాడు. భారత​్‌ తరఫున అంబటి రాయుడు, యువరాజ్‌ సింగ్‌ లాంటి స్టార్లు ఆడుతున్నారు.

భారత మాస్టర్స్‌ జట్టు..
అంబటి రాయుడు (వికెట్‌కీపర్‌), సచిన్ టెండూల్కర్ (కెప్టెన్‌), గురుకీరత్ సింగ్ మన్, స్టువర్ట్ బిన్నీ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి, వినయ్ కుమార్

ఇంగ్లండ్‌ మాస్ట‍ర్స్‌ జట్టు..
ఫిల్ మస్టర్డ్ (వికెట్‌కీపర్‌), టిమ్ ఆంబ్రోస్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), డిమిత్రి మస్కరెన్హాస్, డారెన్ మాడీ, టిమ్ బ్రెస్నన్, క్రిస్ ట్రెమ్లెట్, మాంటీ పనేసర్, స్టీవెన్ ఫిన్, క్రిస్ స్కోఫీల్డ్, ర్యాన్ జే సైడ్‌బాటమ్

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)