‘యాడ్స్‌ చేయడానికే పనికివస్తారు.. కోచ్‌ల మాట అస్సలు వినరు’

Published on Fri, 08/15/2025 - 14:29

పాకిస్తాన్‌ స్టార్‌ క్రికెటర్లు బాబర్‌ ఆజం (Babar Azam), మహ్మద్‌ రిజ్వాన్‌ (Mohammed Rizwan)లపై విమర్శల వర్షం కురుస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి చెత్త ఆట తీరే ఇందుకు కారణం. స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్న బాబర్‌, రిజ్వాన్‌ జట్టు పరాజయాలకు పరోక్ష కారణం అవుతున్నారు.

వన్డే వరల్డ్‌కప్‌ 2023, టీ20 ప్రపంచకప్‌-2024, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో బాబర్‌, రిజ్వాన్‌ వైఫల్యాల కారణంగా పాక్‌ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. 2023, 2024 ప్రపంచకప్‌ టోర్నీల తర్వాత బాబర్‌ ఆజం కెప్టెన్‌ పదవికి రాజీనామా చేయగా.. రిజ్వాన్‌ సారథిగా ఎంపికయ్యాడు.

టీ20ల నుంచి ఉద్వాసన
అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే టీ20 జట్టు నుంచి బాబర్‌తో పాటు రిజ్వాన్‌ను తప్పించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు యాజమాన్యం.. సల్మాన్‌ ఆఘాకు పగ్గాలు అప్పగించింది. ఇక వన్డేల్లోనూ బాబర్‌- రిజ్వాన్‌ జోడీ ఫెయిల్‌ అవుతోంది. తాజాగా వెస్టిండీస్‌తో మూడో వన్డేల్లో వీరిద్దరు చెత్త ప్రదర్శన కనబరిచారు.

ఆతిథ్య విండీస్‌ విధించిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బాబర్‌ ఆజం 23 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులే చేయగా.. కెప్టెన్‌ రిజ్వాన్‌ తొలి బంతికే డకౌట్‌గా వెనుదిరిగాడు. వీరితో పాటు మిగతా ఆటగాళ్లు కూడా విఫలం కావడంతో 92 పరుగులకే ఆలౌట్‌ అయిన పాకిస్తాన్‌.. ఏకంగా 202 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. 34 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను 1-2తో వెస్టిండీస్‌కు కోల్పోయింది.

యాడ్స్‌ చేయడానికే పనికివస్తారు
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ (Basit Ali) బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ల ఆట తీరుపై మండిపడ్డాడు. ‘‘కెరీర్‌ ఆరంభంలో ఎంతో గొప్పగా ఆడిన వీరిద్దరు.. ఇప్పుడు స్థాయికి తగ్గట్లు ఆడటంలో విఫలమవుతున్నారు.

వాళ్లు కేవలం యాడ్స్‌ చేయడానికే పనికివస్తారు. వాళ్లను అలా వదిలేస్తేనే మంచిదేమో!.. కోచ్‌ల మాట వినరు. బ్యాటింగ్‌ కోచ్‌లు ఏదైనా చెప్తే.. విన్నట్లు నటిస్తారంతే. పోనీ.. ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, యూసఫ్‌, యూనిస్‌ ఖాన్‌ లాంటి వాళ్లు సలహాలు ఇస్తేనైనా బాగుపడతారనుకుంటే.. అందుకు బాబర్‌, రిజ్వాన్‌ అందుకు అస్సలు సమ్మతించరు. ఎవరు ఏం చెప్పినా వారు చెవినపెట్టరు’’ అంటూ బసిత్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: ధోని జట్టు నుంచి నన్ను తప్పించాడు.. అప్పుడే రిటైర్‌ అయ్యేవాడిని.. కానీ..: సెహ్వాగ్‌

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)