Breaking News

IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన

Published on Sun, 12/15/2024 - 21:01

నవీ ముంబై వేదికగా వెస్టిండీస్‌ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి విండీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్‌ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. 

భారత ఇన్నింగ్స్‌లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్‌ 20 పరుగులు చేసి ఔట్‌ కాగా.. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (13), సంజీవన్‌ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్‌ బౌలర్లలో కరిష్మ రామ్‌హరాక్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్‌ ఓ వికెట్‌ దక్కించుకుంది.

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో టీ20 మ్యాచ్‌లు డిసెంబర్‌ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్‌లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్‌లకు వడోదర వేదిక కానుంది.

ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్‌.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)