Breaking News

శ్రీలంకతో నాలుగో టీ20.. తొలిసారి టీమిండియాకు చేదు అనుభవం

Published on Sun, 12/28/2025 - 18:56

స్వదేశంలో భారత మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మూడింట టీమిండియానే గెలిచింది. తద్వారా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఈ క్రమంలో ఇవాళ (డిసెంబర్‌ 28) నాలుగో మ్యాచ్‌ జరుగనుంది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో భారత్‌ టాస్‌ కోల్పోవడం ఇదే తొలిసారి.

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు చెరో రెండు మార్పులు చేశాయి. భారత్‌ తరఫున జెమీమా రోడ్రిగ్స్‌, క్రాంతి గౌడ్‌ స్థానాల్లో హర్లీన్‌ డియోల్‌, అరంధతి రెడ్డి తుది జట్టులో​కి వచ్చారు. శ్రీలంక తరఫున ఇనోకా, మదరా స్థానాల్లో కావ్య కవింది, రష్మిక సెవ్వంది ప్లేయింగ్‌ ఎలెవెన్‌లోకి వచ్చారు.

తుది జట్లు..

శ్రీలంక: హాసిని పెరెరా, చమరి అతపత్తు(సి), హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హరి, ఇమేషా దులానీ, నీలక్షికా సిల్వా, కౌషని న్యూత్యాంగన(w), మల్షా షెహానీ, రష్మిక సెవ్వంది, కావ్య కవింది, నిమేషా మదుషాని

భారత్‌: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), రిచా ఘోష్(w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్, శ్రీ చరణి

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)