శ్రీలంకతో తొలి టీ20.. తొలుత బౌలింగ్‌ చేయనున్న టీమిండియా

Published on Sun, 12/21/2025 - 19:01

వన్డే ప్రపంచకప్‌ గెలిచాక భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సిరీస్‌ ఆడుతుంది. ఇవాల్టి నుంచి (డిసెంబర్‌ 21) స్వదేశంలో శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది. విశాఖ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న తొలి టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుంది. మంచు ప్రభావం కారణంగా భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాస్‌ గెలవగానే సంకోచించకుండా బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో వైష్ణవి శర్మ అరంగేట్రం చేయనుంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగనుంది.

మరోవైపు టాస్‌ ఓడిన శ్రీలంక కూడా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఆ జట్టు కెప్టెన్‌ చమరి అతపత్తు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేసింది. 17 ఏళ్ల శశిని గిమ్హనై అందరి దృష్టిని ఆకర్శిస్తుందని తెలిపింది.

తుది జట్లు..
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్‌), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్‌), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనై

టీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)