Breaking News

సుడిగాలి శతకంతో విరుచుకుపడిన టీమిండియా సారధి

Published on Wed, 06/19/2024 - 17:24

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో (మహిళలు) టీమిండియా బ్యాటర్లు పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్‌) సాధించిన మంధన.. ఇవాళ (జూన్‌ 19) జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక్కొట్టింది (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు).

సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్‌
ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్‌; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించింది. కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. భారత్‌ ఇన్నింగ్స్‌లో మంధన, హర్మన్‌ సెంచరీలతో విజృంభించగా.. షఫాలీ వర్మ (20), దయాలన్‌ హేమలత (24), రిచా ఘోష్‌ (25 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

చివరి ఓవర్‌లో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్‌
49వ ఓవర్‌ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్‌ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్‌కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మంధన భారత్‌ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్‌ రికార్డును (7) సమం చేసింది.

 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)