Breaking News

వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన మంధన.. మిథాలీ రాజ్‌ రికార్డు సమం

Published on Wed, 06/19/2024 - 16:55

భారత మహిళల క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధన వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి, పలు రికార్డులు బద్దలు కొట్టింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మంధన తొలి రెండు వన్డేల్లో శతక్కొట్టి, అరుదైన రికార్డులు నెలకొల్పింది.

బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్‌) సాధించిన మంధన.. తాజాగా అదే బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ మెరుపు సెంచరీతో (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిసింది.

మంధన మెరుపు శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. మంధనతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (87 నాటౌట్‌) కూడా చెలరేగి ఆడుతుండటంతో 48 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 302గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో మంధన, షఫాలీ వర్మ (20), దయాలన్‌ హేమలత (24) ఔట్‌ కాగా.. హర్మన్‌కు జతగా రిచా ఘెష్‌ (18) క్రీజ్‌లో ఉంది.

తొలి భారత క్రికెటర్‌గా రికార్డు
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేయడంతో మంధన ఖాతాలో పలు రికార్డులు చేరాయి. మహిళల వన్డే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా మంధన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మంధన మరో రికార్డును సమం చేసింది. 

భారత్‌ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రికార్డును సమం చేసింది. మిథాలీ, మంధన ఇద్దరు వన్డేల్లో 7 సెంచరీలు చేశారు. మంధన 7 వన్డే సెంచరీలను కేవలం 84 ఇన్నింగ్స్‌ల్లో చేస్తే.. మిథాలీ రాజ్‌కు 7 సెంచరీలు సాధించేందుకు 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)