Breaking News

ఆసీస్‌తో రెండో టీ20.. అనూహ్యంగా పుంజుకున్న భారత బౌలర్లు

Published on Thu, 02/19/2026 - 15:46

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఇవాళ (ఫిబ్రవరి 19) రెండో టీ20 ఆడుతుంది. కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. ఆసీస్‌ను 163 పరుగులకే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.

తొలుత ఆసీస్‌ ఓపెనర్లు జార్జియా వాల్‌ (57 బంతుల్లో 88; 11 ఫోర్లు, సిక్స్‌), బెత్‌ మూనీ (39 బంతుల్లో 46; 4 ఫోర్లు) ధాటికి తడబడిన భారత బౌలర్లు.. చివరి 5 ఓవర్లలో అనూహ్యంగా పుంజుకున్నారు.

వాల్‌-మూనీ తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 128 పరుగులు జోడించినా.. అరుంధతి రెడ్డి (4-0-20-2), శ్రీచరణి (3-0-28-0), రేణుకా ఠాకూర్‌ (4-0-27-1) ఊహించని విధంగా పుంజుకొని ఆసీస్‌ను భారీ స్కోర్‌ చేయకుండా నిలువరించారు. వాల్‌, మూనీ మినహా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. 

లిచ్‌ఫీల్డ్‌ 6, ఎల్లిస్‌ పెర్రీ 7, గార్డ్‌నర్‌ 10 (నాటౌట్‌), జార్జియా వేర్హమ్‌ డకౌటయ్యారు. స్కోర్‌ను 170 పరుగులైనా దాటించాలనే ఆతృతతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ చివరి రెండు బంతులకు వికెట్లు కోల్పోయింది. వేర్హమ్‌, పెర్రీ రనౌట్లయ్యారు. ఈ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. శ్రీచరణి ఆసీస్‌ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేసింది. 

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ తొలి టీ20లో 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) విజయం సాధించి, ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఆసీస్‌ పర్యటనలో భారత్‌ టీ20ల తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఆతర్వాత ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)