Breaking News

Asia Cup 2025: భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఆల‌స్యం.. కార‌ణ‌మిదే?

Published on Tue, 08/19/2025 - 12:10

ఆసియాక‌ప్‌-2025కు భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న కాస్త ఆల‌స్యం కానుంది. వాస్త‌వానికి మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 1:30 గంటలకు విలేక‌రుల స‌మావేశంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాల్గోవ‌ల్సింది.

కానీ ముంబైలో భారీ వ‌ర్షాల కార‌ణంగా వీరిద్ద‌రి ప్రెస్‌కాన్ఫ‌రెన్స్ ఆల‌స్యమ్యే అవకాశం ఉందని బీసీసీఐ మీడియా సంస్థలకు స‌మాచార‌మిచ్చిన‌ట్లు హిందూస్తాన్ టైమ్స్ త‌మ క‌థ‌నంలో పేర్కొంది. కాగా ముంబైలో ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ముంబై వ్యాప్తంగా పాఠ‌శాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా అనేక కార్యక్రమాలు ర‌ద్దు చేయ‌బడ్డాయి. ఒక‌వేళ వ‌ర్షం త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోతే అగార్కర్, సూర్య వ‌ర్చ‌వల్‌గా ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది.

ఆసియాక‌ప్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును సెలక్ష‌న్ క‌మిటీ ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ జ‌ట్టులో టెస్టు కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌కు చోటు ద‌క్కుతుందా లేదా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఓపెనింగ్ స్లాట్ కోసం సంజూ శాంస‌న్‌, య‌శ‌స్వి జైశ్వాల్‌, అభిషేక్ శ‌ర్మ‌ల నుంచి గిల్‌కు తీవ్ర‌మైన పోటీ ఉంది. 

అయితే ఈ జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ను సెల‌క్ట‌ర్లు చేర్చిన‌ట్లు తెలుస్తోంది. అత‌డితో పాటు రియాన్ ప‌రాగ్‌కు చోటు క‌ల్పించిన‌ట్లు స‌మాచారం.
ఆసియాక‌ప్‌-2025కు భార‌త జ‌ట్టు(అంచనా): సూర్యకుమార్ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సామ్సన్, జైస్వాల్, తిలక్‌ వర్మ, శ్రేయస్‌ అయ్యర్, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్, కుల్దీప్, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, అర్ష్ దీప్‌ సింగ్, జితేశ్‌ శర్మ.
చదవండి: KBC 2025: ఐపీఎల్‌పై రూ. 7.50 ల‌క్ష‌ల ప్ర‌శ్న‌.. సమాధానం మీకు తెలుసా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)