వరుసగా నాలుగో టీ20లో టీమిండియా జయకేతనం

Published on Tue, 05/07/2024 - 10:10

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ 56 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. 

వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్‌ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.

భారత ఇన్నింగ్స్‌ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్‌ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్‌లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 

భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్‌ (3-1-12-1), పూజా వస్త్రాకర్‌ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో దిలారా అక్తెర్‌ (21) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌ గెలిస్తే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఈ సిరీస్‌ విజయం మాంచి బూస్టప్‌ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానుంది. 

ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్‌, పాక్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో కలిసి గ్రూప్‌-ఏలో.. స్కాట్లాండ్‌.. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్‌-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.

గ్రూప్‌ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్‌ రెండు జట్లు అక్టోబర్‌ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్‌ 20న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న జరుగనుంది.
 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)