Breaking News

శ్రీలంక చేరిన భారత బృందం

Published on Wed, 08/05/2026 - 04:30

కొలంబో: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు శుబ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలోని భారత జట్టు కొలంబోకు చేరుకుంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. టాపార్డర్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మినహా మిగతా 14 మంది మంగళవారం శ్రీలంకలో అడుగు పెట్టారు. ఈ నెల 15 నుంచి గాలేలో తొలి టెస్టు, 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు నిర్వహిస్తారు. వీటికి ముందు ఈ నెల 7 నుంచి మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత్‌ ఆడుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్‌ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. 

ఈ రెండు టెస్టుల్లో భారత్‌ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగుపడతాయి. చివరిసారిగా 2017లో శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్‌ కోసం పర్యటించిన భారత్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే గత ఏడాది నవంబర్‌లో సొంతగడ్డపై ఆఖరి టెస్టు సిరీస్‌ ఆడిన టీమిండియా... దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో ఓటమి పాలైంది. మరోవైపు సాయి సుదర్శన్‌ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ మరింత స్పష్టతను ఆశిస్తోంది. 

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)లో రీహాబిలిటేషన్‌ తర్వాత కూడా అతను పూర్తిగా కోలుకోలేదు. దాంతో జట్టుతో కలిసి అతను శ్రీలంకకు వెళ్లలేదు. ప్రస్తుతం సుదర్శన్‌ గాయం పరిస్థితిని బోర్డు వైద్యులు సమీక్షిస్తుండగా... అతను త్వరలోనే పూర్తి ఫిట్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే శుక్రవారం నుంచి జరిగే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనే సుదర్శన్‌ బరిలోకి దిగుతాడు.

భారత ఫీల్డింగ్‌ కోచ్‌గా శుభదీప్‌...
శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి భారత జట్టుకు కొత్త ఫీల్డింగ్‌ కోచ్‌ బాధ్యతలు చేపడుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్‌ స్థానంలో బీసీసీఐ శుభదీప్‌ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్‌ కోచ్‌గా నియమించింది. 57 ఏళ్ల శుభదీప్‌ గతంలో రెండేళ్ల పాటు భారత మహిళల జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేశాడు. భారత ‘ఎ’, అస్సాం సీనియర్‌ టీమ్‌కు కూడా కోచింగ్‌ ఇచ్చిన అనుభవం అతనికి ఉంది.

 అస్సాంకు చెందిన శుభదీప్‌ 17 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 17 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. భారత ఫీల్డింగ్‌ కోచ్‌గా 2021–2025 వరకు నాలుగేళ్ల పాటు పని చేసిన దిలీప్‌ ... ఆ తర్వాత కాంట్రాక్ట్‌ పొడిగింపుతో మరో ఏడాది పని చేశాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ తర్వాత అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డస్కటే కూడా తప్పుకున్నాడు. డస్కటే, దిలీప్‌ల సేవలను ప్రశంసిస్తూ మంగళవారం బీసీసీఐ సోషల్‌ మీడియాలో ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)