Breaking News

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

Published on Wed, 10/09/2024 - 22:51

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాపై భారత్‌ గెలుపొందింది. 222 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇక దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి టి20 సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

తొలుత టాస్‌ ఓడి బంగ్లాదేశ్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్‌ కుమార్‌ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్‌ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.

హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్‌ 10, అభిషేక్‌ శర్మ 15, సూర్యకుమార్‌ యాదవ్‌ 8, రియాన్‌ పరాగ్‌ 15, వరుణ్‌ చక్రవర్తి 0. సుందర్‌ 0 (నాటౌట్‌), అర్షదీప్‌ సింగ్‌ 6, మయాంక్‌ యాదవ్‌ ఒక్క పరుగు (నాటౌట్‌) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌, తంజిమ్‌ హసన్‌ తలో రెండు వికెట్లు తీశారు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)