శ్రీలంకతో టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు ప్రకటన

Published on Tue, 12/09/2025 - 19:07

డిసెంబర్‌ 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత మహిళల క్రికెట్‌ జట్టును ఇవాళ (డిసెంబర్‌ 9) ప్రకటించారు. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన తర్వాత భారత్‌ ఆడనున్న తొలి సిరీస్‌ ఇదే.

పలాష్‌ ముచ్చల్‌తో పెళ్లి పెటాకులైన తర్వాత మంధన ఎదుర్కోనున్న తొలి పరీక్ష కూడా ఇదే. వరల్డ్‌కప్‌ స్టార్‌ షఫాలీ వర్మ ఈ జట్టులో ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. 

అలాగే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌, వరల్డ్‌కప్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ దీప్తి శర్మ, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్ లాంటి వరల్డ్‌కప్‌ స్టార్లు కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్ల కోటాలో రిచా ఘోష్, జి కమలిని జట్టులో ఉన్నారు. కొత్తగా శ్రీ చరణి, వైష్ణవి శర్మ జట్టులోకి వచ్చారు.

షెడ్యూల్‌..
తొలి టీ20- డిసెంబర్ 21, ఆదివారం, విశాఖపట్నం
రెండో టీ20- డిసెంబర్ 23, మంగళవారం, విశాఖపట్నం 
మూడో టీ20- డిసెంబర్ 26, శుక్రవారం, తిరువనంతపురం 
నాలుగో టీ20- డిసెంబర్ 28, ఆదివారం, తిరువనంతపురం 
ఐదో టీ20- డిసెంబర్ 30, మంగళవారం, తిరువనంతపురం

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)