Breaking News

ఈసారి ఆసియా కప్‌ భారత్‌దే.. కానీ వరల్డ్‌కప్‌ మాత్రం: టీమిండియా మాజీ సెలక్టర్‌

Published on Fri, 08/25/2023 - 15:06

Asia Cup 2023- World Cup 2023: ఆసియా కప్‌-2023 క్రికెట్‌ సమరానికి ఆరు జట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌.. గ్రూప్‌- బి నుంచి బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, శ్రీలంక హోరాహోరీ పోరులో తలపడనున్నాయి. పాకిస్తాన్‌తో కలిసి డిపెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంక సంయుక్తంగా ఈ వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

టీమిండియా తొలి మ్యాచ్‌ పాక్‌తో
ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. కాగా గతేడాది టీ20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌ టోర్నీలో రోహిత్‌ సేన విఫలమైన విషయం విదితమే. అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. ఫైనల్లో పాక్‌ను ఢీకొట్టిన శ్రీలంక టైటిల్‌ విజేతగా నిలిచింది.

అయితే, ఈసారి మాత్రం టీమిండియా గతం తాలూకు తప్పులు పునరావృతం కాకుండా 50 ఓవర్ల ఫార్మాట్‌లో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఆ తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఆధిపత్యం కొనసాగించాలని భావిస్తోంది. 

ఆసియా కప్‌ భారత్‌దే.. కానీ
ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ సెలక్టర్‌ మదన్‌ లాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా కచ్చితంగా ఆసియా కప్‌ గెలుస్తుంది. కానీ.. ప్రపంచకప్‌ విజేత గురించి ఇప్పుడే అంచనా వేయలేం. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, సౌతాఫ్రికాలకు కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అదే ప్లస్‌.. అదే మైనస్‌..
స్వదేశంలో ఆడటం మనకు సానుకూలాంశమే అయినా.. అదే ప్రతికూలంగానూ మారే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఆడుతున్నపుడు భారీ అంచనాల కారణంగా ఒత్తిడి ఉండటం సహజం. అయితే, అదృష్టవశాత్తూ మన జట్టులో ఎక్కువ మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లే ఉన్నారు. 

ఒత్తిడిని ఎలా అధిగమించాలో వారికి బాగా తెలుసు’’ అని మదన్‌ లాల్‌ హిందుస్తాన్‌ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమనం గురించి ప్రస్తావిస్తూ.. వారిద్దరు పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధిస్తేనే టీమిండియా మిడిలార్డర్‌ పటిష్టమవుతుందని పేర్కొన్నాడు.

రాహుల్‌, అయ్యర్‌లకు గత అనుభవం ఉన్నా.. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఎలా రాణిస్తారన్నదే కాస్త ఆందోళన కలిగించే అంశమని మాజీ ఆల్‌రౌండర్‌ మదన్‌ లాల్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: విరాట్‌ కోహ్లికి బీసీసీఐ వార్నింగ్‌.. కారణమిదే! మరోసారి అలా చేయొద్దంటూ! 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)