Breaking News

BGT: టీమిండియా ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించి తీరుతుంది..!

Published on Tue, 11/12/2024 - 15:21

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2024-25పై భారత మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బీజీటీలో భారత్‌ ఆస్ట్రేలియాను ఖచ్చితంగా ఓడించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆసీస్‌ను వారి సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌లో మట్టికరిపించడం ఖాయమని జోస్యం చెప్పాడు. 

భారత్‌ తమ సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో వైట్‌వాష్‌ అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదని అన్నాడు. ఇప్పటికీ ఒత్తిడి ఆస్ట్రేలియాపైనే ఉందని తెలిపాడు. ఇటీవలికాలంలో భారత్‌ ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రతిసారి విన్నింగ్‌ కంటెండర్‌గా బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లు బీజీటీ 2024-25పై చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే వారి నెర్వస్‌నెస్‌ స్పష్టంగా బయటపడుతుందని అన్నాడు. భారత్‌ తాజాగా న్యూజిలాండ్‌ చేతిలో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయినా తిరిగి బౌన్స్‌ బ్యాక్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేతన్‌ శర్మ ఈ విషయాలను షేర్‌ చేసుకున్నాడు.

కేఎల్‌ రాహుల్‌ లేదా అభిమన్యు ఈశ్వరన్‌..
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు రోహిత్‌ శర్మ దూరంగా ఉండాల్సి వస్తే, అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌ లేదా అభిమన్యు ఈశ్వరన్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం​ ఉంది. రోహిత్‌ వ్యక్తిగత కారణాల చేత తొలి టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ప్రచారం​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ రోహిత్‌ నిజంగా తొలి టెస్ట్‌కు దూరమైతే బూమ్రా టీమిండియా సారధిగా వ్యవహరిస్తాడని టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ క్లూ ఇచ్చాడు. తొలి టెస్ట్‌ నవంబర్‌ 22 నుంచి మొదలుకానున్న విషయం తెలిసిందే.

ప్రాక్టీస్‌ షురూ చేసిన టీమిండియా ఆటగాళ్లు..
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌ కోసం​ టీమిండియా ఆటగాళ్లు ఇదివరకే ప్రాక్టీస్‌ షురూ చేశారు. విరాట్‌ సహా భారత్‌ బృందంలోని పలువురు సభ్యులు రెండు రోజుల కిందటే ఆసీస్‌ గడ్డపై అడుగుపెట్టారు. విరాట్‌, కేఎల్‌ రాహుల్‌, యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆస్ట్రేలియా కండీషన్స్‌కు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు 10 రోజుల ముందే మ్యాచ్‌కు వేదిక అయిన పెర్త్‌కు చేరుకున్నారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)