Breaking News

టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌.. జైశ్వాల్‌కు దక్కని చోటు

Published on Thu, 08/03/2023 - 19:45

వెస్టిండీస్‌ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకున్న టీమిండియా ఇక టి20 సిరీస్‌పై దృష్టి పెట్టింది. రోహిత్‌, కోహ్లి సహా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తలపడనుంది. గురువారం ట్రినిడాడ్‌లోని బ్రియాన్‌ లారా స్టేడియంలో విండీస్‌, భారత్‌ల మధ్య తొలి టి20 మొదలైంది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

టెస్టు సిరీస్‌లో సెంచరీతో రాణించిన యశస్వి జైశ్వాల్‌కు తొలి టి20లో చోటు దక్కలేదు. దీంతో తొలి టి20లో ఓపెనర్లుగా గిల్‌, ఇషాన్‌ కిషన్‌ రానున్నారు. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్‌, ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మలు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నారు. చివర్లో హార్దిక్‌ పాండ్యా , అక్షర్‌ పటేల్‌లు రానున్నారు. ఇక బౌలింగ్‌లో ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. స్పిన్నర్లుగా చహల్‌, కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌లు ఉండగా.. ముకేశ్‌ కుమార్‌ టి20ల్లో అరంగేట్రం చేయనుండగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. ఇక నికోలస్‌ పూరన్‌, అల్జారీ జోసెఫ్‌ల రాకతో విండీస్‌ టి20 జట్టు బలంగా కనిపిస్తోంది. 

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)