Breaking News

ద‌క్షిణాఫ్రికాతో రెండో టీ20.. శాంస‌న్‌కు మ‌రోసారి నో ఛాన్స్‌!

Published on Thu, 12/11/2025 - 13:56

ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈమ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే క‌ట‌క్‌లో ఆడిన జ‌ట్టునే రెండో టీ20కు కూడా భార‌త్ కొన‌సాగించే అవ‌కాశముంది.

స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన జితీశ్ శర్మను వికెట్ కీపర్‌గా కొనసాగించాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కటక్ టీ20లో ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన జితీశ్‌.. కేవలం 5 బంతుల్లో పది పరుగులు చేశాడు. 

అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ టాపర్డర్‌లో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే తప్ప సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టం. 

ఇక తొలి టీ20లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌.. ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరముంది. సూర్య గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2026కు ముందు అతడి ఫామ్ టీమ్ మెనెజ్‌మెం‍ట్‌ను కలవరపెడుతోంది. కనీసం ఈ సిరీస్‌లో నైనా సూర్య తన రిథమ్‌ను తిరిగి అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక తొలి టీ20లో ఘోర ఓటమి చవిచూసిన పలు మార్పులు చేసే అవకాశముంది.

తుది జట్లు(అంచనా)
భారత్:  అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

దక్షిణాఫ్రికా:  క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఎన్రిచ్‌ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, కేశవ్ మహారాజ్/జార్జ్ లిండే, లుథో సిపమ్లా.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)