Breaking News

టీమిండియాతో మ్యాచ్‌.. సౌతాఫ్రికా కెప్టెన్‌ ఫెయిల్‌! అయినా భారీ స్కోర్‌

Published on Thu, 10/30/2025 - 17:38

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ తొలి రోజు ఆట ​ముగిసింది. మొదటి రోజు ఆటలో భారత్‌పై సౌతాఫ్రికా బ్యాటర్లు పై చేయి సాధించారు. ప్రోటీస్ ఎ జట్టు డే వన్‌ ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. 

క్రీజులో షెపో మోరెకి(4), కుహ్లే సెలె(0) ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్(71), హంజా(66), రుబిన్‌ హెర్మాన్‌(54) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. కెప్టెన్‌ మార్క్స్ అకెర్మాన్(18) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ముంబై స్పిన్నర్‌ తనీష్‌ కొటియన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మానవ్ సుత్తర్ రెండు, అన్షుల్ కాంబోజ్‌, ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.

పంత్ రీ ఎంట్రీ..
ఇండియా-ఎ జట్టుకు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌, ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పంత్‌.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ కాలి మడమకు గాయమైంది.

దీంతో అతడు దాదాపు  మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో భారత్‌-ఎ తరపున ఆడాలని రిషబ్ నిర్ణయించుకున్నాడు. రెండో అనాధికారిక టెస్టులో కేఎల్ రాహుల్‌, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.
చదవండి: IND vs SA: లంచ్‌కు ముందే టీ బ్రేక్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో తొలిసారి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)