Breaking News

మరో పోరు వర్షార్పణం

Published on Mon, 10/27/2025 - 04:20

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు రద్దు కాగా... లీగ్‌ దశలో చివరి మ్యాచ్‌ కూడా వర్షార్పణమైంది. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో చివరకు ఫలితం తేలకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. 

అయితే ఇప్పటికే సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారు అయిపోవడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ముందుగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత తిరిగి వర్షం పడటంతో 27 ఓవర్లకు తగ్గించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 27 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. షర్మిన్‌ అక్తర్‌ (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... శోభన (26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. 

భారత బౌలర్లలో రాధ యాదవ్‌ 3 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర స్పిన్నర్‌ శ్రీచరణి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. రేణుక సింగ్, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్‌ కౌర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం 27 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత జట్టు 8.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 57 పరుగుల వద్ద ఉన్న స్థితిలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో పలుమార్లు సమీక్షించిన అనంతరం అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన టీమిండియా ఓపెనర్‌ ప్రతీక రావల్‌ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడటంతో ఈ మ్యాచ్‌లో అమన్‌జ్యోత్‌ కౌర్‌ (15 నాటౌట్‌; 2 ఫోర్లు) ఓపెనర్‌గా బరిలోకి దిగింది. స్మృతి మంధాన (27 బంతుల్లో 34 నాటౌట్‌; 6 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది.  రెండు రోజుల విరామం తర్వాత... గువాహటిలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా... నవీముంబైలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడతాయి. 

ఈ రెండు మ్యాచ్‌లకు వర్ష సూచన ఉంది. అయితే సెమీఫైనల్స్‌తోపాటు ఫైనల్‌ మ్యాచ్‌కు ‘రిజర్వ్‌ డే’ ఉంది. ‘రిజర్వ్‌ డే’ రోజున కూడా వర్షంతో మ్యాచ్‌లు సాధ్యంకాకపోతే లీగ్‌ దశలో మెరుగైన స్థానాల్లో నిలిచిన జట్లు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌) ఫైనల్‌కు చేరుతాయి. ఫైనల్‌ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

6 ప్రస్తుత ప్రపంచకప్‌లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లు. శ్రీలంకలో జరిగిన 11 మ్యాచ్‌ల్లో ఐదు వర్షంతో రద్దయ్యాయి. తాజాగా ముంబై పోరు కూడా ఆ జాబితాలో చేరింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)