భారత కుర్రాళ్ల విజయం 

Published on Sun, 01/04/2026 - 05:10

బెనోనీ: అండర్‌–19 వరల్డ్‌ కప్‌కు ముందు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో మొదలైన వన్డే సిరీస్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో భారత అండర్‌–19 జట్టు  25 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌ – లూయీస్‌ ప్రకారం) దక్షిణాఫ్రికా అండర్‌–19పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. హర్‌వంశ్‌ పంగాలియా (95 బంతుల్లో 93; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 

ఇతర బ్యాటర్లలో ఆర్‌ఎస్‌ అంబరీశ్‌ (79 బంతుల్లో 65; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కని‹Ù్క చౌహాన్‌ (23 బంతుల్లో 32; 3 ఫోర్లు), ఖిలాన్‌ పటేల్‌ (12 బంతుల్లో 26; 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. సఫారీ బౌలర్లలో జేజే బాసన్‌ 4 వికెట్లతో భారత్‌ను పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 27.4 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. జోరిక్‌ వాన్‌ షావిక్‌ (72 బంతుల్లో 60 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేయగా, అర్మాన్‌ మనక్‌ (59 బంతుల్లో 46; 4 పోర్లు) రాణించాడు.

 భారత్‌ తరఫున దీపేశ్‌ దేవేంద్రన్‌ 2 వికెట్లు తీయగా, ఖిలాన్‌ పటేల్‌కు ఒక వికెట్‌ దక్కింది. ఈ దశలో ముందుగా ఉరుములు, మెరుపుల కారణంగా ఆట ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కూడా రావడంతో అంపైర్లు పూర్తిగా మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు. ఆట నిలిచిపోయే సమయానికి డక్‌వర్త్‌ – లూయీస్‌ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికా గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. అయితే జట్టు లక్ష్యానికి 26 పరుగులు వెనుకబడి ఉండటంతో ఓటమి ఖాయమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1–0తో ముందంజ వేయగా...రెండో వన్డే ఇదే మైదానంలో సోమవారం జరుగుతుంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)