Breaking News

తొలి టెస్టులో ఓటమి.. గౌతమ్‌ గంభీర్‌ కీలక నిర్ణయం

Published on Mon, 11/17/2025 - 12:09

కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు.. తమ తప్పిదాలను సరిదిద్దుకునేందుకు సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి గౌహతిలో ప్రోటీస్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం టీమిండియా తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టనుంది.

అయితే భారత జట్టు గౌహతిలో కాకుండా ఈడెన్ గార్డెన్స్‌లోనే మొదటి ట్రైనింగ్ సెషన్‌ను మంగళవారం(నవంబర్ 18) నిర్వహించనుంది. ఈడెన్‌ లాంటి కఠినమైన వికెట్‌పై తమ ప్లేయర్లను ప్రాక్టీస్‌ చేయించాలని హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన గంభీర్‌ ఈడెన్‌గార్డెన్స్‌ పిచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌లో ఎటువంటి భూతాలు లేవని, మంచి డిఫెన్స్‌ టెక్నిక్‌ ఉంటే ఇటువంటి వికెట్‌పై పరుగులు సాధించవచ్చు అని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌ జరిగిన పిచ్‌పై భారత ‍బ్యాటర్లు ప్రాక్టీస్‌ చేసే అవకాశముంది.

గౌహతికి ఎప్పుడంటే?
కాగా బుధవారం మెన్ ఇన్ బ్లూ గౌహతికి పయనం కానుంది. అయితే తొలి ప్రాక్టీస్ సెష‌న్‌కు టీమిండియా రెగ్యూల‌ర్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ దూరం కానున్నాడు. మెడ నొప్పి గాయం నుంచి గిల్ కోలుకుంటున్నాడు.

ఆస్ప్ర‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన గిల్ ప్రస్తుతం టీమ్ హోటల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. తొలి టెస్టులో రెండో రోజు ఆట సందర్భంగా గిల్ మెడ నొప్పితో బాధపడ్డాడు. స్వీప్ షాట్ ఆడే క్రమంలో గిల్ మెడపట్టేసింది. దీంతో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడి గిల్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. 

ఆ తర్వాత అతడిని ఆస్ప్రత్రికి తరలించారు. 24 గంటల పర్యవేక్షణ తర్వాత గిల్ ఆస్ప్రత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అతడు మెడ అటు ఇటు కదపుతున్నప్పటికి వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో శుభ్‌మన్ గౌహతి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. 

ఒకవేళ గిల్ అందుబాటులో లేకపోతే అతడి స్దానంలో సాయిసుదర్శన్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా తొలి టెస్టులో భారత్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. కేవలం 124 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక టీమిండియా పరాజయం పాలైంది.
చదవండి: గంభీర్‌.. ఇప్పటికైనా అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)