Breaking News

శ్రీలంక టూర్‌.. బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌? జట్టుతో పాటు ఆ ముగ్గురు?

Published on Tue, 08/04/2026 - 08:58

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2025-27 సైకిల్‌లో టీమిండియా మ‌రో కీల‌క పోరుకు స‌న్న‌ద‌మ‌వుతోంది. శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు  శ్రీలంక‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత బృందం బుధవారం శ్రీలంకకు పయనం కానున్నట్లు తెలుస్తోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే గిల్ సేన ఈ సిరీస్‌లో కచ్చితంగా విజయం సాధించాల్సిందే. దీంతో పది రోజుల ముందే శ్రీలంకకు చేరుకుని భారత జట్టు ప్రాక్టీస్ చేయనుంది. తొలుత ఆగస్టు 7 నుం‍చి ప్రారంభమయ్యే మూడు రోజుల వార్మాప్ మ్యాచ్‌లో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

ఆ త‌ర్వాత మ‌న జ‌ట్టు ప్ర‌త్యేక నెట్ సెష‌న్స్‌లో పాల్గోనుంది. ముఖ్యంగా స్పిన్న‌ర్లను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కోనేందుకు భార‌త బ్యాట‌ర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించ‌నున్నారు. లంక పిచ్‌లు స్పిన్‌కు ఎక్కువ‌గా అనుకూలించే అవకాశ‌మున్నంద‌న బీసీసీఐ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్లు తనుష్ కోటియన్,హర్ష్ దూబే, విప్రాజ్ నిగమ్‌లను నెట్‌బౌల‌ర్ల‌గా సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. జ‌ట్టుతో పాటు వీరు కూడా శ్రీలంక‌కు ప‌య‌నమ‌వుతారు. ఈ స్పిన్ త్ర‌యం నెట్స్‌లో త‌మ సేవ‌ల‌ను అందించనున్నారు. 

విదర్భకు చెందిన హర్ష్ దూబే ఇప్ప‌టికే భార‌త సీనియ‌ర్ జ‌ట్టు త‌ర‌పున వ‌న్డే అరంగేట్రం చేశాడు. అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో దూబే ఆక‌ట్టుకున్నాడు. కానీ మిగితా ఇద్ద‌రు ఆట‌గాళ్లు విప్ర‌జ్ నిగ‌మ్‌, త‌నుష్ కోటియ‌న్ ఇంకా అంత‌ర్జాతీయ అరంగేట్రం చేశారు. కానీ వారిద్ద‌రికి రెడ్‌బాల్ క్రికెట్ ఆడిన అనుభ‌వం ఎక్కువ‌గా ఉంది. 

విప్ర‌జ్ ఈ ఏడాది జూన్‌లో 'ఇండియా-ఎ' తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లి అద‌ర‌గొట్టాడు. ఆల్‌రౌండ్ షోతో ఆతిథ్య జ‌ట్టుకు చుక్క‌లు చూపించాడు. అదేవిధంగా ముంబైకి చెందిన త‌నుష్‌ గత రెండు రంజీ సీజన్లలో అద్భుత ప్రదర్శన చేశాడు.

గ‌తేడాది ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన అనాధికారిక టెస్టు సిరీస్‌లో సైతం అత‌డు భార‌త‌-ఎ జ‌ట్టు త‌ర‌పున అద‌ర‌గొట్టాడు. దీంతో త‌నుష్ కూడా సెల‌క్ట‌ర్ల రాడార్‌లో ఉన్నాడు. ఆల్‌రౌండ‌ర్‌ ర‌వీంద్ర జ‌డేజాకు ప్ర‌త్నామ్నాయంగా తనుష్‌ను జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. కాగా ఈ పర్యటన వారి కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడనుంది.
చదవండి: టీమిండియాను కాపాడిన వరుణుడు.. లేదంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)