Breaking News

శ్రీలంక పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్‌ విడుదల

Published on Thu, 07/02/2026 - 16:27

ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల సిరీస్ అనంతరం భారత పురుషల క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. 

ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ ఆగస్టు 15 నుండి 19 వరకు గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అదేవిధంగా రెండో టెస్టు మ్యాచ్‌(  ఆగస్టు 23 నుండి 27)కు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సై​కిల్‌లో భాగంగా జరగనుంది.

లంకతో సిరీస్ భారత్‌కు చాలా కీలకం. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టీమిండియా ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో(48.15 పీసీటీ) ఐదవ స్ధానంలో నిలిచింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను గిల్ సేన సజీవంగా ఉంచుకోవాలంటే శ్రీలంక గడ్డపై ఖచ్చితంగా గెలవాల్సిందే. అయితే లంకేయులను వారి స్వదేశంలో ఓడించడం అంత ఈజీ కాదు. శ్రీలంక జట్టు గత కొంత కాలంగా సొంత గడ్డపై అద్భుత విజయాలతో దూసుకుపోతోంది.

ఈ దశాబ్దంలో ఆడిన 21 టెస్ట్‌ మ్యాచ్‌లలో 11 విజయాలను శ్రీలంక నమోదు చేసింది. కాగా 2017 తర్వాత భారత్‌ టెస్టుల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. అప్పట్లో విరాట్‌ సారథ్యంలో భారత్‌ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)