Breaking News

ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు

Published on Tue, 05/28/2024 - 16:55

భారత-ఏ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్‌ 31-నవంబర్‌ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌కు ముందు జరుగనుంది. 

ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ నవంబర్‌ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్‌లకు ఫస్ట్‌ క్లాస్‌ హోదా లభించనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియా టెస్ట్‌ జట్టు రెగ్యులర్‌ సభ్యులు కొందరు ఈ సిరీస్‌లో పాల్గొంటారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్‌ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్‌-ఏతో సిరీస్‌ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది.

ఆస్ట్రేలియాలో భారత-ఏ జట్లు పర్యటన వివరాలు..

  • తొలి నాలుగు రోజుల మ్యాచ్‌- భారత్‌-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 3 వరకు క్వీన్స్‌ల్యాండ్‌ వేదికగా జరుగనుంది.

  • రెండో నాలుగు రోజుల మ్యాచ్‌- భారత్‌-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్‌ 7 నుంచి నవంబర్‌ 10 వరకు మెల్‌బోర్న్‌ వేదికగా జరుగనుంది.

  • టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌- నవంబర్‌ 15 నుంచి 17 వరకు పెర్త్‌లో జరుగనుంది.

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2024-25 షెడ్యూల్‌ ఇలా..

  • తొలి టెస్ట్‌- నవంబర్‌ 22-28 వరకు (పెర్త్‌లో)

  • రెండో టెస్ట్‌- డిసెంబర్‌ 6-10 వరకు (అడిలైడ్‌లో)

  • మూడో టెస్ట్‌- డిసెంబర్‌ 14-18 వరకు (బ్రిస్బేన్‌లో)

  • నాలుగో టెస్ట్‌- డిసెంబర్‌ 26-30 వరకు (మెల్‌బోర్న్‌లో)

  • ఐదో టెస్ట్‌- 2025 జనవరి 3 నుంచి 7 వరకు (సిడ్నీలో)

స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)