Breaking News

ప్రపంచకప్‌ ఫైనల్‌.. ఒక జట్టుకేమో 13 ఏళ్ల కరువు.. ఇంకో జట్టుకు చిరకాల కోరిక

Published on Fri, 06/28/2024 - 10:57

టీ20 వరల్డ్‌కప్‌ 2024 తుది అంకానికి చేరింది. భారత్‌, సౌతాఫ్రికా జట్లు ఫైనల్స్‌ చేరాయి. రేపు (జూన్‌ 29) జరుగబోయే ఫైనల్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. బార్బడోస్‌ వేదికగా రేపు రాత్రి 8 గంటలకు ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

టీమిండియాకు 13 ఏళ్ల కరువు
టీమిండియా ప్రపంచకప్‌ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్‌ చివరిసారి (వన్డే వరల్డ్‌కప్‌) ప్రపంచకప్‌ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

టీ20 వరల్డ్‌కప్‌ విషయానికొస్తే.. పొట్టి ప్రపంచకప్‌ను టీమిండియా 2007 అరంగేట్రం ఎడిషన్‌లో సాధించింది. ఆతర్వాత 2014లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

మళ్లీ ఇన్నాళ్లకు భారత్‌కు పొట్టి ప్రపంచకప్‌ గెలిచే అవకాశం వచ్చింది. రేపు జరుగబోయే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను చిత్తు చేసి 13 ఏళ్ల కరువు తీర్చుకోవాలని భావిస్తుంది.

సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరడం ఇదే మొదటిసారి. 1992లో తొలి వరల్డ్‌కప్‌ (వన్డే) ఆడిన సఫారీలు.. ఆతర్వాత 8 వన్డే ప్రపంచకప్‌లు,  9 టీ20 ప్రపంచకప్‌లు ఆడితే తొలిసారి (2024) ఫైనల్‌కు అర్హత సాధించారు. 33 ఏళ్ల తమ పరిమిత ఓవర్ల క్రికెట్‌ చరిత్రలో లభించిన తొలి అవకాశాన్ని సఫారీలు అందిపుచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. వరల్డ్‌కప్‌ గెలవడం సౌతాఫ్రికన్ల చిరకాల కోరికగా మిగిలిపోయింది.

ఇదిలా ఉంటే, ఎయిడెన్‌ మార్క్రమ్‌ నేతృత్వంలోని సౌతాఫ్రికా తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన సౌతాఫ్రికా ఆజేయ జట్టుగా కొనసాగతుంది. 

మరోవైపు భారత్‌.. రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. భారత్‌ సైతం ఈ టోర్నీలో అజేయ జట్టుగా కొనసాగుతుంది. అయితే సూపర్‌-8లో భారత్‌ ఆడాల్సిన ఓ మ్యాచ్‌ (కెనడా) వర్షం కారణంగా రద్దైంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)