Breaking News

అసలు మనిషేనా? ఆ షాట్లు చూసి షాక్ అయ్యా!

Published on Fri, 07/24/2026 - 20:03

టీమిండియా యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఎట్ట‌కేల‌కు త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. హ‌రారే వేదిక‌గా జింబాబ్వేతో జ‌రిగిన తొలి టీ20లో వైభ‌వ్ విధ్వంసం సృష్టించాడు. 126 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో వైభ‌వ్.. ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఉతికారేశాడు. 

ఈ క్ర‌మంలో కేవ‌లం 18 బంతుల్లోనే త‌న‌ మొట్ట‌మొద‌టి హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను సూర్యవంశీ అందుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచ‌రీ సాధించి అత్యంత పిన్న‌వ‌య‌ష్కుడిగా అత‌డు రికార్డులకెక్కాడు. ఈ నేప‌థ్యంలో వైభ‌వ్‌పై త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు మ‌యాంక్ యాద‌వ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 

వైభ‌వ్ అద్భుత‌మైన ఆట‌గాడ‌ని, ఐపీఎల్‌లోనే అత‌డి టాలెంట్ చూశాను అని మ‌యాంక్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మ‌యాంక్ యాద‌వ్ కూడా అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు ప‌డ‌గొట్టి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ నిలిచాడు.

"వైభ‌వ్ బ్యాటింగ్ గురుంచి ఎంత చెప్పుకొన్న త‌క్కువే. ఐపీఎల్‌లో వైభ‌వ్‌కు బౌలింగ్ చేసిన‌ప్పుడు, అత‌డు ఆడిన షాట్ల‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఇప్పుడు తనతో కలిసి ఒకే జట్టులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అతడు భ‌విష్య‌త్తులో క‌చ్చితంగా గొప్ప క్రికెట‌ర్‌గా ఎదుగుతాడు.

అత‌డిలో అద్భుత‌మైన టాలెంట్ ఉంది. ఐపీఎల్‌లో మా బౌలింగ్‌ను వైభ‌వ్ ఉతికారేశాడు. ఈ తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ అత‌డికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే త‌న అరంగేట్ర సిరీస్‌లో అత‌డు అంత‌గా రాణించ‌లేక‌పోయాడు. కానీ ఇప్పుడు జాతీయ జ‌ట్టు త‌ర‌పున తొలి అర్ధశతకాన్ని సాధించాడు. ఏ ఆటగాడికైనా ఇది స్పెష‌ల్ మూమెంటే" అని మయాంక్ పేర్కొన్నాడు.
చదవండి: ఇంగ్లండ్‌ తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌ అతడే?
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)