Breaking News

ఆటకు గుడ్‌బై చెప్పు.. భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Published on Mon, 07/20/2026 - 15:21

ఇంగ్లండ్‌తో కీలక మూడో మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా వన్డే సిరీస్‌నూ కోల్పోయింది. లార్డ్స్‌ మైదానంలో ఆదివారం జరిగిన వన్డేలో గిల్‌ సేన 27 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమికి ప్రధాన కారణం భారత బౌలర్ల వైఫల్యమే అని చెప్పడంలో సందేహం లేదు.

నలుగురు సీమర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, గుర్నూర్‌ బ్రార్‌, ప్రిన్స్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణలతో పాటు.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌లను టీమిండియా బరిలోకి దించింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయపడ్డారు. 

దీంతో వాషీ స్థానంలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను ఆడిస్తారని విశ్లేషకులు భావించారు. అయితే, ఇక్కడ మధ్య ఓవర్లలో స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపుతారన్న కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌.. కుల్దీప్‌ను కాదని ప్రిన్స్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.

మూకుమ్మడిగా విఫలం
అయితే, ఈ  వ్యూహం బెడిసి కొట్టింది. బౌలర్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. గుర్నూర్ బ్రార్‌ అయితే‌ పది ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకుని లార్డ్స్‌లో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇక అర్ష్‌దీప్‌ తన కోటా పూర్తి చేసి 72 పరుగులు ఇవ్వగా.. ప్రసిద్‌ కృష్ణ 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు.

అత్యధిక స్కోరు
మరోవైపు.. ప్రిన్స్‌ యాదవ్‌ పది ఓవర్ల కోటా పూర్తి చేసి 79 రన్స్‌ ఇచ్చుకుని ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్షర్‌ పటేల్‌ పది ఓవర్లలో 61 పరుగులు సమర్పించుకున్నాడు. 

దీంతో ఇంగ్లండ్‌ నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి 387 పరుగులతో లార్డ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమిండియా 360 పరుగులు మాత్రమే చేసి ఓటమిని ఆహ్వానించింది.

రిటైర్మెంట్‌ ప్రకటించేలా ఒత్తిడి
ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ కైఫ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుల్దీప్‌ యాదవ్‌ పట్ల మేనేజ్‌మెంట్‌ వైఖరి సరిగ్గా లేదని విమర్శించాడు. ‘‘కుల్దీప్‌ కెరీర్‌ ముగిసిపోయింది.. ఇక బ్యాగులు సర్దుకోవడమే తరువాయి.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలి’ అనేలా కుల్దీప్‌ను గందరగోళంలో పడేస్తున్నారు.

లార్డ్స్‌ మ్యాచ్‌లో బుమ్రా, వాషింగ్టన్‌, వరుణ్‌ చక్రవర్తి.. ఈ ముగ్గురూ లేరు. మరి వాషీ స్థానంలోనైనా కుల్దీప్‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు కదా!.. లార్డ్స్‌లో వైవిధ్యంగా బౌలింగ్‌ చేసేవాళ్లు కావాలి. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన కుల్దీప్‌ ఇక్కడ గొప్పగా బౌలింగ్‌ చేయగలడు.

118 వన్డేల్లోనే అతడు 194 వికెటుల​ కూల్చాడు. అయినా సరే ఈ గణాంకాలను మీరు పరిగణనలోకి తీసుకోరు అనిపిస్తోంది. ఇక భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం​ కుల్దీప్‌ యాదవ్‌ను ఆడించకపోవడాన్ని తప్పుబట్టాడు. 

అశూ ఆగ్రహం
ఇంగ్లండ్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించకుండా అతడిని పక్కనపెట్టారని.. ఇది కుల్దీప్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అశూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా యూకే పర్యటనలో టీ20 సిరీస్‌లలో ఐర్లాండ్‌ చేతిలో 2-0, ఇంగ్లండ్‌ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్‌స్వీప్‌ అయింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో 2-1తో ఓటమిపాలైంది.

చదవండి: అందుకే అతడు బెంచ్‌కే పరిమితం: గిల్‌

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)