Breaking News

విండీస్‌తో రెండో టెస్టు డ్రా.. టీమిండియాకు బిగ్‌ షాక్‌! టాప్‌లో పాకిస్తాన్‌

Published on Tue, 07/25/2023 - 08:53

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయంపై వరుణుడు నీళ్లు జల్లాడు. వర్షం కారణంగా రెండో టెస్టు పలితం తేలకుండా పోయింది. పలుమార్లు వాన రావడం, తగ్గడం, మళ్లీ రావడం జరిగాయి. ఆట ఆరంభమవుతుందని అనిపించడం, పిచ్‌ను సిద్ధం చేసే ప్రయత్నం చేయడం, అంతలోనే చినుకులతో పరిస్థితి మారిపోవడం తరచుగా జరిగింది.

చివరకు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 2:50కు అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీమిండియా 1-0 తేడాతో టెస్టు సిరీస్‌ని సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి సత్తా చాటిన సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్టు లభించింది. అనంతరం జూలై 25 నుంచి ఇరు జట్లు మధ్య వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

రెండో స్ధానానికి పడిపోయిన టీమిండియా
ఇక రెండో టెస్టు డ్రా ముగియడం.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో టీమిండియాపై తీవ్ర ప్రభావం పడింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు రెండో స్ధానానికి పడిపోయింది.  రెండో టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియాకి 33.33 శాతం పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీమిండియా విన్నింగ్ శాతం 66.66కి పడిపోయింది.

అంతకుముందు తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిన టీమిండియా 100 గెలుపు శాతంతో తొలి స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఒక వేళ ఈమ్యాచ్‌లో విజయం సాధించివుంటే 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్‌తో తన తొలి స్ధానాన్ని కాపాడుకుండేది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్‌ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్‌ అగ్రస్ధానంలో ఉంది. శ్రీలంకపై తొలి టెస్టులో విజయం సాధించిన పాక్‌ 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్‌ టాప్‌కు చేరుకుంది.
చదవండి: #Rohit Sharma: మా దురదృష్టం.. అతడి లాంటి ఆటగాళ్లు జట్టుకు కావాలి! కొంచెం కూడా భయపడలేదు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)