టీమిండియా కొంప‌ముంచిన చెత్త ఫీల్డింగ్‌..

Published on Thu, 10/30/2025 - 19:19

మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2025లో భాగంగా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు.

లిచ్‌ఫీల్డ్ సూపర్ సెంచరీ..
తొలుత ఆస్ట్రేలియా యువ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు సెంచరీతో చెలరేగింది. 22 ఏళ్ల లిచ్‌ఫీల్డ్‌ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించింది. 93 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్‌.. 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 119 పరుగులు  చేసింది. ఆ తర్వాత ఎల్లీస్‌ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), గార్డెనర్‌(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు.

బౌలర్లు విఫలం..
ఈ కీల‌క పోరులో భార‌త బౌల‌ర్లు చెతులేత్తేశారు. స్పిన్న‌ర్ శ్రీచ‌ర‌ణి మిన‌హా మిగితా బౌల‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ దీప్తీ శ‌ర్మ బంతితో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 9.5 ఓవ‌ర్లు బౌలిగ్ చేసిన దీప్తీ.. రెండు వికెట్లు ప‌డ‌గొట్టిన‌ప్ప‌టికి ఏకంగా 73 ప‌రుగులు స‌మ‌ర్పించుకుంది. ఆమెతో పాటు రాధా యాద‌వ్‌, అమ‌న్ జ్యోత్ కౌర్ కూడా భారీగా ప‌రుగులిచ్చారు. భార‌త బౌలింగ్‌ను కంగారులు ఓ ఆట ఆడుకున్నారు. చరణి మాత్రం తన 10 ఓవర్ల కోటాలో 49 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించింది.

చెత్త ఫీల్డింగ్‌..
ఇక ఫీల్డింగ్‌లో టీమిండియా తీరు ఏ మాత్రం మార‌లేదు. ఈ మ్యాచ్‌లో కూడా ఫీల్డింగ్‌లో భార‌త్ తీవ్ర నిరాశ‌ప‌రిచింది. తొలుత హ‌ర్మన్ ప్రీత్ విడిచిపెట్టిన క్యాచ్ నుంచి మొద‌లైన ఫీల్డింగ్ క‌ష్టాలు మ్యాచ్ ఆఖ‌రి వ‌ర‌కు కొన‌సాగాయి. 

ఈ మ్యాచ్‌లో మిస్ ఫీల్డ్స్‌, బంతిని స‌రిగ్గా అందుకోక‌పోవ‌డం, ఓవ‌ర్ త్రోస్ వంటి త‌ప్పిదాల‌ను భార‌త ఫీల్డ‌ర్లు చేశారు. అందుకు భార‌త్ భారీ మూల్యం చెల్సించుకోవాల్సి వ‌చ్చింది. టీమిండియా ప్లేయ‌ర్లు స‌రిగ్గా ఫీల్డింగ్ చేసి ఉంటే ఆసీస్ స్కోర్ 300 ప‌రుగుల మార్క్‌ను దాటక‌పోయేది.

ఈ టోర్నీలో భారత జట్టు ఫీల్డింగ్ గణాంకాలు 
పట్టిన క్యాచ్‌లు- 35 
వదిలేసిన క్యాచ్‌లు-18   
క్యాచింగ్ సామర్థ్యం-  66%    
మిస్ అయిన స్టంపింగ్‌లు- 3 
మిస్‌ఫీల్డ్‌లు - 74 
ఓవర్‌త్రోలు అయిన బంతులు-   6 
చదవండి: IND vs SA: టీమిండియాతో మ్యాచ్‌.. సౌతాఫ్రికా కెప్టెన్‌ ఫెయిల్‌! అయినా భారీ స్కోర్‌
 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)