దక్షిణాఫ్రికా బ్యాటర్ల విరోచిత పోరాటం

Published on Thu, 11/13/2025 - 19:30

రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్‌-ఎ జ‌ట్టుతో జ‌రుగుతున్న తొలి అన‌ధికారిక వ‌న్డేలో సౌతాఫ్రికా-ఎ లోయార్డ‌ర్‌ బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్‌ చేసన ప్రోటీస్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 285 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

అయితే టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన స‌ఫారీల‌కు భార‌త స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. అత‌డి బౌలింగ్ ధాటికి తొలి ఓవ‌ర్‌లోనే ద‌క్షిణాఫ్రికా రెండు వికెట్ల‌ను కోల్పోయింది. రెండో ఓవ‌ర్‌లో ప్రసిద్ద్ కృష్ణ సైతం కెప్టెన్ మార్క్వెస్ అకెర్‌మాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. 

ఆ తర్వాత అర్ష్‌దీప్‌, సింధు వరుస ఓవర్లలో మరో రెండు వికెట్లు సాధించారు. దీంతో ప్రోటీస్ జట్టు కేవలం 53 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి  పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో దిల్దానో పోట్‌గీటర్(88 పరుగులు; 103 బంతుల్లో), డెలనో పోట్‌గీటర్ (77 పరుగులు; 83 బంతుల్లో) విరోచిత పోరాటం కనబరిచారు.

వీరిద్దరూ ఆరో వికెట్‌కు వందకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అదేవిధంగా స్పిన్నర్‌ బ్యోర్న్ ఫార్టూన్ (59 పరుగులు; 56 బంతుల్లో) బ్యాట్‌తో సత్తాచాటాడు. దీంతో భారత్‌కు ఫైటింగ్ టార్గెట్‌ను సౌతాఫ్రికా ఉంచింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ కృష్ణ, నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి తలో ఒక వికెట్ పడగొట్టారు. 

286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ(31), రియాన్‌ పరాగ్‌(8) వికెట్లను మెన్‌ ఇన్‌ బ్లూ కోల్పోయింది.
చదవండి: ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ.. భారత తుది జట్టు ఇదే
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)