టీమిండియా సూపర్ విక్టరీ.. 27 బంతుల్లోనే టార్గెట్‌ ఫినిష్‌

Published on Wed, 09/10/2025 - 22:16

ఆసియాక‌ప్‌-2025లో భార‌త్ శుభారంభం చేసింది. ఈ టోర్నీలో భాగంగా బుధ‌వారం దుబాయ్ వేదిక‌గా యూఏఈతో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భార‌త బౌల‌ర్ల ధాటికి 13.1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 57 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

టీమిండియా స్పిన్ ఉచ్చులో యూఏఈ బ్యాట‌ర్లు చిక్కుకున్నారు. ఓపెన‌ర్లు అలీషన్ షరాఫు(22), కెప్టెన్ వ‌సీం మ‌హ్మ‌ద్(19) ఆరంభంలో ప‌ర్వాలేద‌న్పించారు. ష‌రాఫూను బుమ్రా ఔట్ చేశాక యూఏఈ వికెట్ల ప‌తనం మొద‌లైంది. భార‌త స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ 2.1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 7 ప‌రుగులిచ్చి 4 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. అత‌డితో పాటు ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబే మూడు, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, అక్షర్ పటేల్‌, బుమ్రా తలా వికెట్ సాధించారు.

అభిషేక్ ధానాధన్‌..
అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలో ఊదిపడేసింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్ కాగా.. శుబ్‌మన్ గిల్‌(20), సూర్యకకుమార్ యాదవ్‌(7) ఆజేయంగా నిలిచారు. యూఏఈ బౌలర్లలో సిద్దుఖీ ఒక్క వికెట్ సాధించాడు. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.
చదవండి: Asia Cup 2025: జ‌స్ప్రీత్ బుమ్రా సూప‌ర్ యార్క‌ర్‌.. దెబ్బ‌కు బ్యాట‌ర్ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)