Breaking News

చైనా చేతిలో చిత్తుగా... 

Published on Wed, 09/20/2023 - 01:33

హాంగ్జూ (చైనా): ఆసియా క్రీడల కోసం ఫుట్‌బాల్‌ జట్టునే పంపడం లేదని కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటన...నేరుగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ కోచ్‌ లేఖ...చివరకు గ్రీన్‌ సిగ్నల్‌...అత్యుత్తమ ఆటగాళ్లను ఇవ్వలేమంటూ ఐఎస్‌ఎల్‌ జట్ల కొర్రీలు...ఆఖరి నిమిషంలో తృతీయ శ్రేణి జట్టు ఎంపిక...కనీసం టీమ్‌ జెర్సీలపై ఆటగాళ్ల పేర్లు కూడా రాసుకోలేని స్థితి... ఇన్ని అడ్డంకుల తర్వాత ఎట్టకేలకు భారత ఫుట్‌బాల్‌ జట్టు సోమవారం సాయంత్రం చైనా గడ్డపై అడుగు పెట్టింది.

కనీసం ఒక్కరోజు కూడా ప్రాక్టీస్‌ లేదు...16 గంటల్లోనే మ్యాచ్‌ బరిలోకి...సబ్‌స్టిట్యూట్‌లుగా దించేందుకు తగినంత మంది కూడా బెంచీపై లేరు... చివరకు ఊహించినట్లుగానే ప్రతికూల ఫలితం వచ్చింది. తొలి పోరులో ఆతిథ్య చైనా చేతుల్లో చిత్తుగా ఓడి నిరాశను మిగిల్చింది. అధికారికంగా ఆసియా క్రీడలు ఈ నెల 23నుంచి ప్రారంభం అవుతున్నా...కొన్ని ఈవెంట్లు ముందే మొదలైపోయాయి.  

గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా మంగళవారం జరిగిన పోరులో చైనా 5–1 గోల్స్‌ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. తొలి అర్ధభాగంలో 1–1తో పరిస్థితి మెరుగ్గానే ఉన్నా...రెండో అర్ధభాగంతో నాలుగు గోల్స్‌తో చైనా చెలరేగింది. చైనా తరఫున జియావో టియాని (17వ నిమిషం), డీ వీజన్‌ (51వ నిమిషం), టావో కియాగ్లాంగ్‌ (72వ నిమిషం, 75వ నిమిషం), హావో ఫాంగ్‌ (90+2వ నిమిషం)లో గోల్స్‌ సాధించారు.

భారత్‌ తరఫున ఏకైక గోల్‌ను కనోలీ ప్రవీణ్‌ రాహుల్‌ (45+1వ నిమిషం) నమోదు చేశాడు. మ్యాచ్‌ ఆసాంతం ఇరు జట్ల మధ్య తీవ్ర అంతరం కనిపించింది. 86 నిమిషాలు మైదానంలో ఉన్నా కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. జట్టులోని ఎనిమిది మంది ఆటగాళ్లు మొత్తం 90 నిమిషాలు ఫీల్డ్‌ ఉండటం పరిస్థితిని చూపిస్తోంది. భారత్‌ ఈ గ్రూప్‌నుంచి ముందంజ వేయాలంటే తర్వాతి మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, మయన్మార్‌లపై తప్పనిసరిగా గెలవాలి.  

కంబోడియాను ఓడించి... 
వాలీబాల్‌లో మాత్రం భారత్‌ గెలుపుతో శుభారంభం చేసింది. ఈ పోరులో భారత్‌ 3–0 (25–14, 25–13, 25–19) తేడాతో తమకంటే బాగా తక్కువ ర్యాంక్‌ గల కంబోడియాను ఓడించింది. గ్రూప్‌ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్‌లో రేపు అత్యంత పటిష్టమైన కొరియాను భారత్‌ ఎదుర్కోనుంది. 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)