Breaking News

IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల

Published on Fri, 11/28/2025 - 17:22

భారత మహిళా క్రికెట్‌ జట్టు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్‌ విడుదుల చేసింది. సొంతగడ్డపై భారత జట్టు శ్రీలంకతో డిసెంబరు 21 నుంచి డిసెంబరు 30 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపింది.

ఈ సిరీస్‌కు విశాఖపట్నం, తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ (BCCI) తన ప్రకటనలో పేర్కొంది. నిజానికి భారత్‌- బంగ్లాదేశ్‌ మహిళా జట్ల మధ్య సిరీస్‌ జరగాల్సింది. ఇందుకోసం భారత జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 2026కు ఈ టూర్‌ను వాయిదా వేశారు.

టీ20 ప్రపంచకప్‌-2026కి సన్నాహకంగా
ఈ క్రమంలో శ్రీలంకతో భారత్‌ (IND vs SL T20Is) మ్యాచ్‌లు ఆడే విధంగా తాజాగా షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు.. శ్రీలంకతో టీ20 సిరీస్‌ ద్వారా తమ తదుపరి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.

ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 12- జూలై 5 వరకు జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ఇరుజట్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్‌ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు మహిళల ప్రీమియర్‌ లీగ్‌తో బిజీగా కానున్నారు.

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేదికలు ఇవే
నవీ ముంబై, వడోదర వేదికలుగా జనవరి 9 - ఫిబ్రవరి 5 మధ్య  ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15- మార్చి 6 వరకు మల్టీ ఫార్మాట్‌ టోర్నీ ఆడనుంది.

భారత్‌ వర్సెస్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌
👉డిసెంబరు 21- ఆదివారం- తొలి టీ20- విశాఖపట్నం
👉డిసెంబరు 23- మంగళవారం- రెండో టీ20- విశాఖపట్నం
👉డిసెంబరు 26- శుక్రవారం- మూడో టీ20- తిరువనంతపురం
👉డిసెంబరు 28- ఆదివారం- నాలుగో టీ20- తిరువనంతపురం
👉డిసెంబరు 30- మంగళవారం- ఐదో టీ20- తిరువనంతపురం.

చదవండి: భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)