కొంప‌ముంచిన చెత్త ఫీల్డింగ్‌.. సౌతాఫ్రికా చేతిలో భార‌త్ ఓట‌మి

Published on Sun, 06/21/2026 - 22:35

మ‌హిళల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో భార‌త జ‌ట్టుకు తొలి ఓట‌మి ఎదురైంది. మాంచెస్ట‌ర్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ప‌రాజ‌యం పాలైంది. భార‌త్ నిర్ధేశించిన 159 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్రోటీస్ కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవ‌ర్ల‌లో చేధించింది. 

ద‌క్షిణాఫ్రికా విజ‌యంలో ఆల్‌రౌండ‌ర్ మరిజాన్ కాప్‌ది కీల‌క పాత్ర‌. కాప్‌ (45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. ఆమెతో పాటు ఓపెనర్ బ్రిట్స్‌(40) రాణించింది. అయితే భారత్ ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫలమ్యనే చెప్పాలి.  

మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన కాప్‌.. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెండు సార్లు కూడా ఆమె ఇచ్చిన క్యాచ్‌లను భారత సబ్‌స్ట్యూట్ ఫీల్డర్ రాధా యాదవ్ జారవిడిచింది. ఆ క్యాచ్‌లు అందుకుని ఉండింటే ఫలితం మరో విధంగా ఉండేది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టింది.

ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(29), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(24), మంధాన(17) పర్వాలేదనిపించారు. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్‌, ఇస్మాయల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్బా, అయబోంగ ఖకా, నడైన్‌ డిక్లార్క్‌ తలా వికెట్‌ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 25న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)