Breaking News

Asian Games 2023: బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం.. నాకౌట్‌ ఆశలు సజీవం

Published on Thu, 09/21/2023 - 18:16

చైనాలోని హాంగ్‌ఝౌ వేదికగా జరుగుతున్న ఏషియన్‌ గేమ్స్‌ 2023 పురుషుల ఫుట్‌బాల్‌ ఈవెంట్‌లో భారత్‌ బోణీ కొట్టింది. రౌండ్‌ ఆఫ్‌ 16కు (నాకౌట్‌) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌పై 1-0 గోల్స్‌ తేడాతో గెలుపొందింది. 

హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ 85వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్‌లో గోల్‌ కొట్టి భారత్‌ను గెలిపించాడు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనా చేతిలో 1-5 గోల్స్‌ తేడాతో ఓడి, నాకౌట్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్‌.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శక్తివంచన లేకుండా పోరాడి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఈ గెలుపుతో భారత్‌ గ్రూప్‌-ఏలో చైనా, మయన్మార్‌లతో సమానంగా 3 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. సెప్టెంబ‌ర్ 24న మ‌య‌న్మార్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ నేరుగా రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధిస్తుంది. 

రౌండ్‌ ఆఫ్‌ 16కు ఎలా..?
ఏషియన్‌ గేమ్స్‌ పురుషుల ఫుట్‌బాల్‌లో భారత్‌, చైనా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. ఈ పోటీల్లో గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున మొత్తం 6 గ్రూప్‌లు ఉన్నాయి.  ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో ఉన్న జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచే మరో నాలుగు అత్యుత్తమ జట్లు రౌండ్‌ ఆఫ్‌ 16కు చేరతాయి. 

భారత్‌ అవకాశాలు ఎలా..?
గ్రూప్‌-ఏలో చైనా, మయన్మార్‌ జట్లు ఇప్పటివరకు ఆడిన ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించి, తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో చైనా చేతిలో ఓడి, రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లాదేశ్‌ గ్రూప్‌-ఏలో ఆఖరి స్థానంలో నిలిచి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్‌ తదుపరి మయన్మార్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే, గ్రూప్‌లో రెండో స్థానానికి ఎగబాకి నేరుగా రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధిస్తుంది. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)