Breaking News

చరిత్ర సృష్టించిన టీమిండియా.. 65 ఏళ్లలో ఇదే తొలిసారి

Published on Sun, 10/12/2025 - 09:33

వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా జోరు కొన‌సాగుతోంది. రెండో రోజు ఆట‌లోనూ ప‌ర్యాట‌క జ‌ట్టుపై భార‌త్ ఆధిప‌త్యం చెలాయించింది. 318/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జ​ట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న యశస్వి జైశ్వాల్ అనుహ్యంగా రనౌటై తన వికెట్‌ను కోల్పోయాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యువ ఆటగాళ్లు నితీష్ కుమార్‌, ధ్రువ్ జురెల్‌ కెప్టెన్ గిల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్‌ 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీస్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. యశస్వి జైశ్వాల్ (177), శుభ్‌మన్ గిల్(129) భారీ శతకాలతో కదం తొక్కగా..నితీశ్‌ (54 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జురేల్‌ (79 బంతుల్లో 44; 5 ఫోర్లు), సాయిసుదర్శన్‌(87) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.

భారత్ సరికొత్త రికార్డు..
అయితే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. గత 65 ఏళ్లలో వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఐదు వికెట్లకు వరుసగా 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. 

టాప్-5 బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వరుసగా ఐదు వికెట్లకు ఏభైకి పైగా  పార్ట్‌నర్‌షిప్స్‌ నెలకొల్పారు. తొలి వికెట్‌కు రాహుల్-జైస్వాల్ 58, రెండో వికెట్‌కు జైస్వాల్-సాయి సుదర్శన్ 193, మూడో వికెట్‌కు జైస్వాల్-శుభ్‌మన్ గిల్ 69, నాలుగో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-నితీష్ కుమార్ రెడ్డి 91, ఐదో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-ధ్రువ్ జురెల్ 102 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు.

అప్పుడు ఆసీస్‌.. ఇప్పుడు భారత్‌
1960లో గబ్బా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన అరుదైన టై టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఐదు వికెట్లకు ఏభైకి పైగా  పార్ట్‌నర్‌షిప్స్‌ను నెలకొల్పింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు భారత్ ఈ ఫీట్ సాధించింది.

మూడో సారి..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్ ఈ ఘనతను సాధించడం ఇది మూడోసారి. 1993లో ముంబైలో ఇంగ్లండ్‌, 2023లో అహ్మదాబాద్ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. కానీ విండీస్‌పై మాత్రం ఇదే తొలిసారి.
చదవండి: టీ20 క్రికెట్‌లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)