మళ్లీ భారత్ × పాకిస్తాన్ ఫైనల్‌?

Published on Thu, 11/20/2025 - 09:04

మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో సెమీఫైన‌ల్ బెర్త్‌లు ఖ‌రార‌య్యాయి. గ్రూపు-ఎ నుంచి బంగ్లాదేశ్‌-ఎ, శ్రీలంక‌-ఎ.. గ్రూపు-బి నుంచి పాకిస్తాన్‌, భార‌త్ జ‌ట్లు సెమీస్‌కు అర్హ‌త సాధించాయి. తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌, భారత జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టాలని భారత్ పట్టుదలతో ఉంది.

ఇక సెకెండ్ సెమీఫైనల్లో పాకిస్తాన్ షాహీన్స్‌, శ్రీలంక అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ రెండు సెమీస్ మ్యాచ్‌లు శుక్రవారం(నవంబర్ 21)  దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి.

పాక్ జోరు..
కాగా  ఈ ఖండాంతర టోర్నమెంట్‌లో దాయాది పాకిస్తాన్ ఇప్పటివరకు అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. లీగ్ స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పాక్ విజయం సాధించింది.  భారత్‌-ఎతో జరిగిన మ్యాచ్‌లో కూడా పాక్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 8 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. మాజ్ సదాకత్ (79 పరుగులు, 2 వికెట్లు) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.

పాకిస్తాన్ వర్సెస్ భారత్ ఫైనల్‌?
కాగా తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించడం జితేశ్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుకు నల్లేరు మీద నడకే. ఇండియా జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య, నమన్ ధీర్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు.

బౌలింగ్‌లో కూడా యష్ ఠాకూర్‌, యుద్దవీర్ సింగ్ వంటి యువ సంచలనాలు సత్తా చాటుతున్నారు. మరోవైపు పాక్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండడంతో శ్రీలంకను ఓడించడం దాదాపు ఖాయమనే చెప్పాలి. దీంతో మరోసారి ఫైనల్ పోరులో పాక్‌-భారత్ తలపడే అవకాశముంది.
చదవండి: IND vs SA: టీమిండియా కెప్టెన్‌గా ఎవ‌రూ ఊహించ‌ని ప్లేయ‌ర్‌?

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)