Breaking News

అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు.. క్లారిటీతో ఉన్నాము: టీమిండియా కోచ్‌

Published on Fri, 12/05/2025 - 20:47

భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటి? గ‌త కొన్ని సిరీస్‌ల‌గా క్రికెట్ వ‌ర్గాల్లో వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే సుంద‌ర్‌ మూడు ఫార్మాట్ల‌లోనూ భార‌త జ‌ట్టులో రెగ్యూల‌ర్ స‌భ్యునిగా ఉంటున్నాడు. కానీ ఓ మ్యాచ్‌లో స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్‌గా ఆడితే..మ‌రో మ్యాచ్‌లో స్పిన్న‌ర్‌గా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌రిస్తున్నాడు. 

బ్యాటింగ్‌లో కూడా ఒక స్దానంలో పంప‌డం లేదు.  ఒక మ్యాచ్‌లో మూడో స్దానం, మ‌రో మ్యాచ్‌లో ఆరో స్దానం అలా అత‌డి బ్యాటింగ్ ఆర్డ‌ర్ మారుతూనే ఉంది. బౌలింగ్‌లో కూడా స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై తీవ్ర‌స్దాయిలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా జ‌ట్టులో సుంద‌ర్ రోల్‌పై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్‌గానే వాషీని జ‌ట్టులోకి తీసుకున్న‌ట్లు టెన్ డెష్కాట్ తెలిపాడు. కాగా సౌతాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌లో సుంద‌ర్ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన రెండు వ‌న్డేల‌లోనూ బ్యాట్‌తో పాటు బంతితో కూడా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో అత‌డిని మూడో వ‌న్డే నుంచి త‌ప్పించాల‌ని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మంచు ప్రభావం కారణంగా స్పిన్నర్లు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం లభించడం లేదు. 

అందుకే సుందర్‌కు రాంచీలో 3 ఓవర్లు, రాయ్‌పూర్‌లో 4 ఓవర్లు మాత్రమే ఇచ్చాము. అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. గ‌త ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తన బ్యాటింగ్ మెరుగుపరచుకోవడానికి కూడా సుందర్ కృషి చేస్తున్నాడు అని పోస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్ పేర్కొన్నాడు.
చదవండి: కోహ్లి, రోహిత్ కాదు.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికింది అత‌డినే

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)